వీరాంజనేయులు &  రాజ్యలక్ష్మి సమర్పించు  భరత్, సంచిత శెట్టి,చాందిని తమిళ రసన్, ఖతీర్ ,రాధా రవి ,యోగ్ జపి, ఆత్మ పాట్రిక్, గడ్డం కిషన్  నటీనటులుగా అరుణ్ కృష్ణస్వామి దర్శకత్వంలో కుబేర ప్రసాద్ నిర్మించిన చిత్రం “ఆట నాదే.. వేట నాదే” .అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ చిత్రం అక్టోబర్ 2 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది. ఈ  సందర్భంగా

 చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ .. మనిషి జీవితమే ఒక ఆట ప్రేమ అనే ఆటలో గెలవాలంటే మనుసులను  గెలవాలి,  మనసులను గెలవాలంటే గెలుపోటములు ఉంటాయి . గెలుపు ఓటమి అనేది ప్రతి ఆట లో ఉంటాయి .ఒక ప్రేమికుడు తను  కోరుకున్న అమ్మాయిని గెలుచు కోవడం కోసం గుర్రపు పందేలు ఆడదానికి సిద్ధమయ్యి ఆఖరి రూపాయి వరకు తను ఎంత కష్టపడ్డాడు ఆ గుర్రపు పందేలు ఎంతోమంది హేమాహేమీలు ఉన్నా.. గుర్రపు పందేలలో తను నెగ్గి తన ప్రేమను గెలిపించు కున్నాడా..తను గెలిచాడా.. ఒడిపోయాడా.. తనకోసం అనుకోని  ఇంకొక తన ఫ్రెండ్ ను ఈ ఉచ్చు లోకి లాగితే అమాయకుడైన ఫ్రెండ్ తను కూడా ఈ పోటీకి సిద్ధమై తను  సహాయ పడ్డాడా.. తను గెలిచాడా.. తన ప్రేమను గెలిపించుకున్నాడా… గెలుపు ఓటమి అనేది మనిషికి ముఖ్యం అది ప్రేమ కావచ్చు జీవితంలో కావచ్చు  ఆటలో అవ్వచ్చు అయితే ఈ ఆట ఆడేటప్పుడు ప్రేమ  మనిషిని గెలిపించుకోవడం కోసం రేస్ ఆడవలసిన అవసరం లేదు అని చెప్పవచ్చు.అలాగే మనిషి తన ప్రేమను గెలిపించుకోవడం కోసం  దేనికైనా  తెగిస్తాడు  అనేది సినిమా ఇతి వృత్తం. తనని తాను గేలుసుకోవడం కోసం తనను తన మనసు చేసిన చేసిన అమ్మాయిని  గెలుచుకోవడం కోసం ఇద్దరు కుర్రాళ్లు ఈ ఆటలో పోటీపడి ఎలా నెగ్గారు. తన ప్రేమను ఎలా గెలిపించుకున్నారు తన జీవితంలో ఎలా గెలిచారు   అనేదే మా “ఆట నాదే.. వేట నాదే”.. అంటే ఆట కోసం వేట మొదలెట్టాలి ఆ  వేట సక్సెస్ అయితే మన ఆట ఆడి గెలిచినట్లే..అందుకే  ఈ చిత్రానికి  ఆట నాదే.. వేట నాదే.. టైటిల్ పెట్టడం జరిగింది.సినిమా చాలా బాగా వచ్చింది అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబరు 2 న విడుదల చేస్తున్నాము. ఈ సినిమా ప్రేక్షకులందరికీ తప్పకుండా నచ్చుతుందని అన్నారు.

 నటీనటులు
భరత్, సంచిత శెట్టి,చాందిని తమిళ రసన్, ఖతీర్ ,రాధా రవి , యోగ్ జపి, ఆత్మ పాట్రిక్, గడ్డం కిషన్ తదితరులు

 సాంకేతిక నిపుణులు
సమర్పణ :-వీరాంజనేయులు & రాజ్యలక్ష్మి
నిర్మాత :- కుబేర ప్రసాద్
రచన దర్శకత్వం :-అరుణ్ కృష్ణస్వామి
సహ నిర్మాతలు :- అక్కినేని శ్రీనివాసరావు, అట్లూరి సురేష్ బాబు
సంగీతం :- ఏ మోసెస్
ఛాయాగ్రహణం :; యువ
కూర్పు :- గోపికృష్ణ
వి.ఎఫ్.ఎక్స్  :-చందు ఆది – అండ్ టీం
ఆర్ట్ డైరెక్టర్ :- సుబ్బు.ఏ
నృత్యం :-  విజయ సతీష్
పాటలు, మాటలు :-భారతీబాబు
నేపథ్య సంగీతం :- సుదర్శన్ కుమార్
పి.ఆర్.ఓ :- మధు వి.ఆర్

Leave a comment

error: Content is protected !!