G.O.A.T. movie : “జిగి జింతాకు చూపే ఒక స్పార్కూ…ఆ నాజుకు నడకే ఒక క్యాట్‌ వాకూ…” అంటూ తన ప్రేయసిని అద్భుతంగా వర్ణించే ఓ రొమాంటిక్ సాంగ్ యువన్‌ శంకర్‌ రాజా స్వరకల్పనలో రూపుదిద్దుకుంది. దళపతి విజయ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్న ‘గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’ చిత్రం నుంచి విడుదలైన ‘స్పార్క్‌’ పాటలోని లైన్సే అవి. ఈ పాట ప్రస్తుతం ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది.

మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను యువన్‌ శంకర్‌ రాజా వృష బాలుతో కలిసి ఆలపించారు. విజయ్‌, మీనాక్షి చౌదరిల హుక్‌ స్టెప్పులు ఈ పాటకు మరింత అందాన్ని చేకూర్చాయి.

స్నేహ, లైలా, ప్రభుదేవా వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం వచ్చే నెల 5న విడుదల కానుంది. విజయ్‌ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అంటూ దళపతి విజయ్ డ్యూయల్ రోల్స్ తో .. అభిమానుల్ని స్పెల్ బౌండ్ చేయడానికి వచ్చే నెల్లోనే వచ్చేస్తున్నాడు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ను మెప్పిస్తుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!