బ్యూటీ.. బోల్డ్ నెస్ .. హాట్ నెస్ .. ఒకదానికొకటి పోటీపడుతూ..  ఒకరిలోనే తిష్టవేసుకొని కూర్చుంటే ..ఆ అందం పేరే సోనమ్ కపూర్. బాలీవుడ్ ప్రేక్షకులు ఆమెను ముద్దుగా సో.. బ్యూటీఫుల్ కపూర్ అని పిలుచుకుంటారు. తండ్రి అనిల్ కపూర్ బాలీవుడ్ లో బడా హీరో. ఆయన నట వారసత్వాన్నిపుణికిపుచ్చుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన బాణీని ఏర్పచుకొని .. కథానాయికగా వెలుగొందుతోంది . వరుస హిట్స్ తో దూసుకుపోతోంది. సోనమ్ కపూర్ కథానాయికగా మారకముందు .. కళాత్మక దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ దగ్గర సహాయకురాలిగా పనిచేసింది. ఆ తర్వాత రణబీర్ కపూర్ తో స్ర్కీన్ షేర్ చేసుకొని మొట్టమొదటిసారిగా కథానాయికగా ‘సావరియా’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. తమిళ హీరో ధనుష్ సరసన ‘రాంజానా’లో సిగ్గుపడుతూ మురిపించింది. బాలీవుడ్‌లో ఆమెకు అవకాశాలొచ్చేలా చేసిందీ చిత్రం. ఇక ‘భాగ్‌ మిల్కా భాగ్‌’తో భారీ విజయాన్నుందుకుంది. ‘బేవకూఫియాన్‌’లో అల్లరిపిల్లగా అందరినీ మంత్రముగ్థుల్ని చేసింది. ఈ మూడు చిత్రాలతో హ్యాట్రిక్‌ హిట్టందుకుంది. ‘డోలీ కీ డోలీ’లో మంచి ప్రతిభ కనబరిచింది. ఇక సోనమ్‌ కేరీర్‌లో బ్లాక్‌ బాస్టర్‌గా నిలిచిన చిత్రం ‘ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో’. దీంతో ఆమె రెమ్యూనరేషన్‌ అమాంతం పెరిగిపోయింది. ఉగ్రవాదులు హైజాక్‌ చేసిన విమానం నుంచి ప్రయాణికులను రక్షించిన ప్రముఖ మోడల్‌ నీరజా భనోట్‌ పాత్రను ‘నీరజా’ చిత్రంలో ఒక సామాజిక కోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ చిత్రానికి సోనమ్‌ జాతీయ పురస్కారంతోపాటు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు వరించాయి. ‘పాడ్‌మ్యాన్‌’లో అక్షయ్‌ కుమార్‌కు సాయమందిస్తూ మంచి ప్రతిభ కనబరిచింది. ఈ చిత్రంలో నటనకుగాను దాదాసాహెబ్‌ ఫాల్కే ఫౌండేషన్‌ పురస్కారాన్ని అందుకుందామె. నటిగా సోనమ్‌ ఎన్నో అవార్డులను కైవసం చేసుకుంది. 2018 ‘వీరే దీ వెడ్డింగ్‌’లో నటించింది. ‘సంజు’లో రణ్‌బీర్‌ సింగ్‌ ప్రేమికురాలిగా నటించింది. సోనమ్‌ కపూర్‌ 2018లో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ అహూజాను వివామాడింది. నేడు సోనమ్ కపూర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

 

Leave a comment

error: Content is protected !!