కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాల్ని ఒణికిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీని ప్రభావంగా చాలా మంది రోడ్డున పడ్డారు. ముఖ్యంగా రోజువారి కూలీలకు పనేలేకుండా పోవడంతో వారిని ప్రముఖులు, సినీ సెలబ్రిటీస్ రకరకాలుగా ఆదుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వారికి రోజువారి రేషన్ అందించడానికి నిధుల సేకరణలో భాగంగా బాలీవుడ్ నటి తన కళాకృతులను వేలానికి పెట్టింది బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా.
అన్షులా కపూర్ నిధుల సేకరణ వేదికగా ‘ఫ్యాన్‌కైండ్’ అనే దాన్ని ఏర్పాటు చేసింది. అందులో భాగంగా బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా తన దగ్గర ఉన్న కళాకృతులను, పెయింటింగ్స్ ని వేలానికి పెట్టింది. అంతేకాదు పెయింటింగ్స్ తో కూడిన వీడియోను ట్విట్టర్లో పెట్టింది. ‘‘కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న రోజువారి కూలీల కోసం ‘ప్యాన్‌కైండ్’తో నిధుల సేకరణ కోసం చేతులు కలిపాను. మీరంతా అత్యధికంగా బిడ్డింగ్ వేసి ఆదుకోండి..’’ అంటూ ట్విట్టర్లో పేర్కొంది. ఇప్పటికే పిపిఇ కిట్లను పూణెలోని సర్దార్ పటేల్ ఆసుపత్రికి విరాళంగా ఇచ్చి తన దొడ్డ మనసు చాటుకుంది. ప్రస్తుతం ఈ ‘ప్యాన్‌కైండ్’లో చాలామంది సెలబ్రీటీలు చేరారు. ఈ నిధుల సేకరణ, స్వచ్చంధ సంస్థలకు ఉపయోగపడుతుంది.
Bid for Good!
I have teamed up with @FankindOfficial to auction my art & help raise funds to provide ration kits to daily wage workers. There is something for everyone – digital prints, sketches & large canvas paintings. The highest bidder wins! https://t.co/MrgsFnSvaZ pic.twitter.com/MquGf8zKPg— Sonakshi Sinha (@sonakshisinha) May 15, 2020