Solo Boy : బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ హీరోగా నటిస్తున్న సోలో బాయ్ సినిమా టైటిల్ సాంగ్ లాంచ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో సినిమా యూనిట్ సభ్యులు, నటీనటులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. బిగ్ బాస్ లో ఇచ్చిన మాట ప్రకారం సోలో బాయ్ టైటిల్ సాంగ్‌ని తానే చేశానని, డాన్సర్‌గా మారితే మంచి డాన్సర్‌గా ఉంటానని కోచ్ చెప్పారని తెలిపారు. సాంగ్ రచయిత కాసర్ల శ్యామ్, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌లకు హీరో గౌతమ్ కృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సినిమాలో గౌతమ్ కృష్ణకు తల్లి పాత్రలో నటిస్తున్నానని, గౌతమ్ చాలా నెమ్మదిస్తుడు అందరి గురించి ఆలోచిస్తాడని అనిత చౌదరి తెలిపారు. గౌతమ్ డాన్స్ చాలా బాగా చేశాడని, ఫ్యూచర్‌లో పెద్ద హీరో అవుతాడని కొరియోగ్రాఫర్ ఆట సందీప్ అభిప్రాయపడ్డారు. గౌతమ్ కృష్ణ అన్ని రకాల సన్నివేశాల్లో తనదైన శైలిలో నటించాడని డైరెక్టర్ పి. నవీన్ కుమార్ తెలిపారు.

గౌతమ్ కృష్ణ ఫ్యూచర్‌లో పెద్ద హీరో అవుతాడని, సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని ప్రొడ్యూసర్ సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.  ఇంక సోలో బాయ్ టైటిల్ సాంగ్ హుక్ స్టెప్ చాలెంజ్ చేసిన వారికి బహుమతులు ప్రకటించారు. మొదటి బహుమతిగా 30,000 రూపాయలు, రెండవ బహుమతిగా 20,000 రూపాయలు, మూడవ బహుమతిగా 10,000 రూపాయలు ఇస్తామని ప్రకటించారు.

 

Leave a comment

error: Content is protected !!