నరేశ్ నటజీవితంలో చెప్పుకోదగ్గ స్థాయిలో విజయం సాధించిన  రొమాంటిక్ లవ్ స్టోరీ  సొగసుచూడతరామా. కె.రామ్ గోపాల్ నిర్మాణంలో  గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన  ఈ సినిమా 1995, జూలై 14న విడుదలైంది. సరిగ్గా నేటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా లో కథానాయికగా ఇంద్రజ నటించగా…  తనికెళ్ళ భరణి, మల్లికార్జునరావు, రమణమూర్తి, దేవదాస్ కనకాల తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. హాలీవుడ్ మూవీ ‘ఇండీసెంట్ ప్రపోజల్’ కు ఫ్రీమేక్ గా తెరకెక్కింది ఈ సినిమా.

ప్రేమించి పెళ్లి చేసుకుంటారు వెంకట్రావు, నీలిమా. తమ వైవాహిక జీవితంపై,  భవిష్యత్తుపై ఎన్నో కలలు కంటారు. అయితే వెంకట్రావు ఉద్యోగం చేసే కంపెనీ బాస్ రూపంలో అతడికి కొత్త కష్టాలు ఎదురవుతాయి. చివరికి ఆ సమస్యల సుడిగుండం నుంచి ఆ దంపతులిద్దరూ ఎలా గట్టెక్కుతారు అనే కథాంశంతో సొగసుచూడతరమా చిత్రంతెరకెక్కింది. 

అప్పట్లో ‘సొగసు చూడతరమా’ చిత్రం  సెన్సేషనల్ హిట్ అవడమే కాకుండా ప్రతిష్ఠాత్మకమైన మూడు నంది అవార్డులను సాధించింది. బెస్ట్ ఫిల్మ్ గా బంగారు నంది ని అందుకున్న ఈ చిత్రానికి బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా కూడా గుణశేఖర్ నంది అవార్డును అందుకున్నారు. బెస్ట్ కాస్ట్యూమ్స్ నంది అవార్డును కుమార్ తీసుకున్నారు. ఇక ఈ సినిమాకి విశాల్ భరద్వాజ్ అందించిన సంగీతం సినిమాకే ప్రధాన ఆకర్షణ అయిపోయింది. ప్రత్యేకించి ఏసుదాసు పాడిన టైటిల్ సాంగ్ .. ఈ సినిమాకి ఓ సిగ్నేచర్  సాంగ్ లా నిలిచిపోయింది.

 

Leave a comment

error: Content is protected !!