ఎస్‌జే సూర్య… గ్రేట్ డైరెక్టర్.. ఇప్పుడు విలక్షణ నటనతో గ్రేట్ యాక్టర్ అనిపించుకుంటున్నాడు. సందర్భం వచ్చినపుడల్లా ప్రస్తుత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి, వారి మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ గురించి చెప్తూనే ఉంటారు. ప్రస్తుతం ఎస్‌జే సూర్య ‘గేమ్ ఛేంజర్’ లో యాక్ట్ చేస్తున్నారు. జనవరి 4 న జరిగిన ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ ఛీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ కూడా ఎస్‌జే సూర్య గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్ జే సూర్య మీడియాతో గేమ్ చేంజర్ గురించి , పవన్ కళ్యాణ్ గురించి తన అనుబంధాన్ని పంచుకున్నారు.
గేమ్ ఛేంజర్ మూవీ ఓ నిజాయితీ గల ఐఏఎస్ అధికారికి , పొలిటికల్ లీడర్‌కి జరిగిన వార్ అన్నారు. గ్లోబల్‌స్టార్ రామ్ చరణ్ అద్భుతంగా నటించారన్నారు. అప్పన్న పాత్రలో చెర్రీ జీవించారన్నారు. శంకర్ డైరెక్షన్‌లో నటించడం గొప్ప అనుభూతి అని, ఈ చిత్రంలో తన నటన చూసే భారతీయుడు 2 లో చాన్స్ ఇచ్చారన్నారు.
ఇక పవన్ కళ్యాణ్ గురించి చెప్తూ… చాలా కాలం తర్వాత కలిసానని, ఆయన్ను చూడగానే ఆనందంతో మాటలు రాలేదన్నారు. ఖుషి నాటి సంగతులు గుర్తు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచిస్తారనీ, ఆయన ఐడియాలజీ నాకు అప్పట్లో అర్ధం కాలేదని, ఇప్పుడు ప్రజా జీవితంలోకి వచ్చాక ఆయన చేస్తున్న పనులు చూసి ఇప్పుడు అర్ధమవుతుందన్నారు. స్టేజ్ మీద తన గురించి పవన్ మాట్లాడుతుంటే సంతోషంతో నోట మాట రాలేదన్నారు. ఆయన్ను హగ్ చేసుకుంటే తెలియని మ్యాజిక్ ఎక్స్‌పీరియెన్స్ చేసానన్నారు.
జనవర 10 గేమ్ చేంజర్ పెద్ద హిట్ కాబోతుందని ఆశాభావం వ్యక్తం చేసారు ఎస్‌జే సూర్య.