Singham Again : బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో అజయ్‌ దేవగణ్‌ లేటెస్ట్ మూవీ “సింగమ్‌ అగైన్‌” చిత్రం కశ్మీర్ షెడ్యూల్ పూర్తయింది. రోహిత్‌ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. ఈ చిత్రంలో అజయ్‌ దేవగణ్‌ మరోసారి బాజీరావ్‌ సింగమ్‌ పాత్రలో నటిస్తున్నారు. అక్షయ్‌ కుమార్, రణ్‌వీర్‌ సింగ్, టైగర్‌ ష్రాఫ్, దీపికా పదుకొణె, కరీనా కపూర్‌ తదితర నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. అర్జున్‌ కపూర్‌ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు.

“సింగమ్‌ ఆన్‌ డ్యూటీ. కశ్మీర్‌ షెడ్యూల్‌ ముగిసింది. రెండింతల యాక్షన్‌తో పోలీసు సింగమ్‌ మళ్లీ రావడానికి సిద్ధమవుతున్నార’’ అని చిత్రీకరణ పూర్తి అయిన సందర్భంగా అజయ్‌ దేవగణ్‌ సోషల్‌ మీడియాలో ఓ వీడియోను పంచుకున్నారు. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్, జియోస్టూడియోస్‌తో కలిసి అజయ్‌ దేవగణ్‌ నిర్మించిన ఈ చిత్రం యాక్షన్‌ సన్నివేశాలతో ప్రేక్షకులను మెప్పించనున్నట్లు తెలుస్తోంది.

Leave a comment

error: Content is protected !!