ఆమె ఒక అందమైన పాట. పాటంత అందమైనది ఆమె. ఆమె గాత్రం తేనెల జలపాతం.. ఆమె గానం తియ్యని మధుపాత్రం. సంగీతంలో దిట్ట. సరిగమల పుట్ట. ఆ గాయని పేరు ఉష. ఉషాకిరణ్ మూవీస్ వారు ఈటీవీలో నిర్వహించిన పాడుతా తీయగా పాటల కార్యక్రమం ద్వారా వెలుగులోకి వచ్చిన అత్యద్భుతమైన గాయని ఆమె.

ఆంధ్రప్రదేశ్‌లోని నాగార్జునసాగర్‌లో జన్మించింది. గాయనిగా ఈమె ప్రస్థానం ‘ఈటీవీ’ టెలివిజన్‌ ప్రోగాం ‘పాడుతా తీయగా’ ద్వారా మొదలైంది. ఈ పాటల పోటీలో తొలిస్థానంలో నిలవగా తర్వాత జెమినీలోని ‘నవరాగం’ అనే కార్యక్రమంలోనూ సత్తా చాటి చిత్ర సీమ దృష్టిని ఆకర్షించింది. అంతేకాక ‘స్టార్‌ టీవీ’ లోని ‘మేరీ ఆవాజ్‌ సునో’ కార్యక్రమంలో పాల్గొని ఆల్‌ ఇండియా ఫైనల్స్‌కి ఎంపికయింది. చిత్ర సీమలోకి అడుగు పెట్టాక సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్‌ వద్ద తొలి అవకాశాన్ని పొందింది. ఆమె తొలిచిత్రం ‘ఇల్లాలు’. ఆ తర్వాత చిత్ర సీమలో నేపధ్యగాయనిగా ‘ఇంద్ర’, ‘చిరుత’, ‘అతిథి’, ‘వర్షం’, ‘భద్ర’, ‘చిత్రం’, ‘నువ్వునేనూ’, ‘మనసంతా నువ్వే’, ‘నువ్వులేక నేనులేను’, ‘జయం’, ‘సంతోషం’, ‘అవునన్నా కాదన్నా’ వంటి సినిమాలతో గాయనిగా ఎందరో సినీ, సంగీత ప్రియుల మదిని దోచుకుంది. రెండుసార్లు ఉత్తమ నేపథ్య గాయనిగా నంది అవార్డులను అందుకుంది. నేడు ఉష పుట్టినరోజు .ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

హ్యాపీ బర్త్ డే ఉష

Leave a comment

error: Content is protected !!