నటసింహ నందమూరి బాలకృష్ణ కెరీర్ లో చాలా ప్రత్యేకమైన చిత్రం ‘సింహా’. బోయపాటి శ్రీను దర్శకత్వంలో యునైటెడ్ మూవీస్ బ్యానర్ పై పరుచూరి కిరీటి నిర్మించిన ఈ సినిమా టాలీవుడ్లో ఘన విజయం సాధించింది. 2010, ఏప్రిల్ 30 న విడుదలైన ఈ సినిమా సరిగ్గా నేటికి పదేళ్ళు పూర్తి చేసుకుంది. ‘విజయేంద్రవర్మ, అల్లరి పిడుగు, వీరభద్ర, మహారధి, ఒక్కమగాడు, పాండురంగడు, మిత్రుడు’ లాంటి సినిమాలతో వరుసగా పరాజయాలు ఎదుర్కొన్న బాలయ్య ..  ఆరేళ్ళ గ్యాప్ ను సింహా బ్లాక్ బస్టర్ తో పూడ్చేసి అభిమానుల ఆకలిని తీర్చాడు. మాస్ దర్శకుడు బోయపాటి బాలకృష్ణ ను రెండు పవర్ ఫుల్ పాత్రలతో మలిచి… మాస్ ప్రేక్షకుల్లో పూనకాలు తెప్పించాడు. ముఖ్యంగా ఇందులో బాలయ్య  పలికే డైలాగ్స్ తో థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. నయనతార , స్నేహా ఉల్లాల్ కథానాయికలు గా నటించిన ఈ సినిమాలో రహమాన్, కె.ఆర్.విజయ, బ్రహ్మానందం, మలయాళ నటుడు సాయికుమార్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. చక్రి సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలు ఎంతగానో ఆకట్టుకుంటాయి.

 

 

Leave a comment

error: Content is protected !!