పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్, యంగ్ హీరో దీపక్ సరోజ్ ‘సిద్ధార్థ్ రాయ్’ తో హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి వంటి పెద్ద దర్శకుల దగ్గర పనిచేసిన వి యశస్వీ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమౌతున్నారు. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ & విహిన్ క్రియేషన్స్ బ్యానర్‌లపై జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యువతను ఆకట్టుకునే ప్రోమోలతో ఇప్పటికే ఈ చిత్రం హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. టీజర్, పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈరోజు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ , దర్శకులు సాయి రాజేష్, వీరశంకర్, లక్ష్మీ భూపాల ఈ వేడుకలో ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.
కథానాయకుడి బాల్యం నుంచి 20ఏళ్ల మధ్య చూపే స్లైస్ ఆఫ్ లైఫ్ స్టోరీ. ఆరోగెంట్ యాటిట్యూడ్ అతని జీవితానికి పెద్ద శత్రువుగా మారుతాయి. ప్రేమ, భావోద్వేగాలను ఆస్వాదించడం ప్రారంభించిన తర్వాత, తనలోని సంఘర్షణ అతని డౌన్ ఫాల్ కి దారి తీస్తుంది. విజువల్‌ గా అద్భుతంగా తీర్చిదిద్దారు.
దర్శకుడు వి యశస్వీ యంగ్ స్టర్ ప్రయాణాన్ని ఇంటెన్స్ గా చూపించాడు. మల్టిపుల్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో దీపక్ సరోజ్ అద్భుతంగా నటించాడు. డిఫరెంట్ లుక్స్‌లో కనిపించాడు. ఈ చిత్రంలో తన్వి నేగి కథానాయికగా నటించింది. సామ్ కె నాయుడు కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. రధన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఒక బిగ్గెస్ట్ ఎసెట్ గా నిలిచింది. ప్రవీణ్ పూడి ఈ చిత్రానికి ఎడిటర్. సిద్ధార్థ్ రాయ్ బలమైన భావోద్వేగాలతో కూడిన యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ అని ట్రైలర్ ప్రామిస్ చేస్తోంది. ఫిబ్రవ‌రిలో సినిమాను విడుద‌ల చేయ‌నున్నట్లు నిర్మాత‌లు అనౌన్స్ చేశారు.

Leave a comment

error: Content is protected !!