Shopping Cart 0 items - $0.00 0

శుభాకాంక్షలు

????????????????????????????????????????????????????????????

 

 

జగపతి బాబు సినీ కెరీర్ లో మరపురాని చిత్రం ‘శుభాకాంక్షలు’. 1997, ఫిబ్రవరి 14న విడుదలై ఘనవిజయం సాధించిన  ఈ సినిమాకు దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు. రవళి, రాశి కథానాయికలు గా నటించిన ఈ సినిమాలో కైకాల సత్యనారాయణ, నాగేశ్, ఆనంద్ రాజ్, దేవన్, బ్రహ్మానందం, సుధాకర్, ఏవీయస్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. తాను ప్రేమించిన అమ్మాయి సుఖ సౌఖ్యాల కోసం పాటుపడే ఒక భగ్న ప్రేమికుడిగా జగపతి బాబు నటన ఆకట్టుకుంటుంది. కోటి సంగీత సారధ్యంలోని పాటలు .. ఇప్పటికీ సంగీత ప్రియుల్ని అలరిస్తూనే ఉన్నాయి. ఆనందమానందమాయే, గుండెనిండా గుడిగంటలు లాంటి పాటలు అప్పటి కుర్రకారును ఉర్రూతలూగించాయి. నిజానికి ఈ సినిమా తమిళంలో 1996లో విడుదలైన ‘పూవే ఉనక్కాగ’ చిత్రానికి రీమేక్ వెర్షన్. దళపతి విజయ్, సంగీత జంటగా నటించిన ఈ సినిమాకి దర్శకుడు విక్రమన్. ఇదే సినిమా ఆ తర్వాత కన్నడలో ఈ హృదయనినగాగి గానూ, హిందీలో బదాయ్ హో బదాయ్ గానూ రీమేక్ అయి ఆయా భాషల్లో కూడా సూపర్ హిట్టైంది.  సాయిరామ్ ప్రొడక్షన్స్  పతాకంపై ఆర్ బీ చౌదరి నిర్మించిన ‘శుభాకాంక్షలు’ చిత్రం టాలీవుడ్ లో ఎప్పటికీ ఓ ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోతుంది.

Leave a comment

error: Content is protected !!