అందమైన మోము.. ఆకట్టుకొనే కళ్లు .. ఆకర్షించే నవ్వు .. కలగలిస్తే శ్రుతి హాసన్. చక్కటి సౌందర్యంతో పాటు .. అద్భుతమైన అభినయం కూడా అమ్మడి సొత్తు. అందుకే అమ్మడు తమిళ గడ్డ పై పుట్టినా.. ఇటు  తెలుగు ప్రేక్షకుల్ని, అటు బాలీవుడ్ జనాన్ని ఎట్రాక్ట్ చేయగలిగింది. లోకనాయకుడు కమల్ హాసన్ గారాల పట్టిగా.. సినీ రంగ ప్రవేశం చేసిన శ్రుతి హాసన్ తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకొని మంచి నటిగా పేరు తెచ్చుకుంది.

2000లో తండ్రి కమల్ తెరకెక్కించిన ‘హేరామ్’ చిత్రంలో బాలనటిగా చిత్ర రంగ ప్రవేశం చేసిన శ్రుతి హాసన్ కి.. చిన్నతనం నుంచీ సంగీతం పట్ల మక్కువ ఎక్కువ. 2008లో సోహం షా దర్శకత్వంలో తెరకెక్కిన “లక్” సినిమాతో బాలీవుడ్ లోకి తెరంగేట్రం చేసింది శ్రుతి హాసన్.   2011లో  “అనగనగా ఓ ధీరుడు” సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.  కానీ ఆ మూవీ పరాజయం పాలైంది. అయితే  పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రంతో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకొని ..ఆ తర్వాత మరికొన్ని దక్షిణాది చిత్రాల్లో నటించింది. ఆ మధ్య శ్రుతి సినిమాలకు కాస్తంత బ్రేకిచ్చి.. రిఫ్రష్ అయి .. మళ్లీ వరుస సినిమాలకు సైన్ చేసింది. నేడు శ్రుతి హాసన్ బర్త్ డే . ఆ అందాల సుందరికి బర్త్ డే విషెస్ తెలుపుతోంది మూవీ వాల్యూమ్. హ్యాపీ బర్త్ డే శ్రుతి హాసన్ .

Leave a comment

error: Content is protected !!