Decoit : అడివి శేష్, శ్రుతిహాసన్ జోడీగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ “డెకాయిట్”. ఈ సినిమా షూట్ జెట్ స్పీడ్ తో జరుగుతోంది. షానీల్ డియో దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. సునీల్ నారంగ్ సహ నిర్మాత. తాజాగా, ఈ చిత్ర సెట్లోకి హీరోయిన్ శ్రుతిహాసన్ అడుగు పెట్టినట్లు చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ షెడ్యూల్లో భాగంగా శేష్, శ్రుతిలపై భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.
“ఇది ఇద్దరు మాజీ ప్రేమికుల కథ. వాళ్లు తమ జీవితాలను మార్చుకోవడానికి వరుస దోపిడీలకు పాల్పడతారు. ఆ ప్రయాణంలో వారికి ఎదురయ్యే సవాళ్లు, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారు అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది” అని చిత్ర యూనిట్ తెలిపింది. అడివి శేష్ ఈ చిత్రానికి స్వయంగా కథ, స్క్రీన్ప్లే అందించారు. “డెకాయిట్” తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.