Coolie movie : సూపర్ స్టార్ రజనీకాంత్, క్రేజీ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న పక్కా యాక్షన్ ట్రీట్ కూలీ. రజనీకాంత్ స్టైల్ కు లోకేశ్ కనగరాజ్ టేకింగ్ యాడ్ అయితే ఆ సినిమా ఎలా ఉంటుంది అనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఈ సినిమాలోని వివిధ పాత్రల్ని, పాత్రధారుల్ని పరిచయం చేస్తూ మేకర్స్ పోస్టర్స్ వదులుతున్నారు.

ఆల్రెడీ అక్కినేని నాగార్జున సైమన్ అనే కీలక పాత్రను పోషిస్తున్నారు. దక్షిణాదిన ఇద్దరు స్టార్స్ ఒకే చిత్రంలో కలిసి నటించడం అభిమానుల్ని ఖుషీ చేస్తోంది. ఇద్దరు స్టార్ హీరోల కలయిక ఈ చిత్రానికి మరింత బలాన్ని చేకూర్చుతుందని చెప్పవచ్చు. ఇక లేటెస్ట్ గా ఇందులో శ్రుతి హాసన్ కూడా నటిస్తున్నట్టు మేకర్స్ తెలిపారు. ఈ చిత్రంలో ఆమె ప్రీతి అనే పాత్రను పోషిస్తున్నారు. ఆమె ఫస్ట్ లుక్ చాలా ఆకర్షణీయంగా ఉంది. గడ్డపార వంటి వస్తువును చేతపట్టుకొని ఆమె కనిపించే విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

మొత్తం మీద, ‘కూలీ’ చిత్రం తెలుగు చలనచిత్ర రంగంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. రజనీకాంత్, నాగార్జున, శ్రుతి హాసన్ వంటి స్టార్ హీరోలు, లోకేశ్ కనగరాజ్ వంటి ప్రముఖ దర్శకుడు, అనిరుధ్ రవిచందర్ వంటి సంగీత దర్శకుడు కలిసి చేస్తున్న ఈ చిత్రం తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!