Shobhitha Dhulipala : నవయువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, అందాల శోభిత ధూళిపాళల నిశ్చితార్థం తెలుగు సినీ వర్గాల్లో సంచలనం సృష్టించింది. కింగ్ నాగార్జున ఈ విషయాన్ని తనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించడంతో ఈ వార్త వైరల్‌గా మారింది. చైతూకు ఇది రెండో వివాహం. ఇంతకు ముందు సమంతను చైతూ ప్రేమించి పెళ్ళిచేసుకున్న సంగతి తెలిసిందే. ఆ బంధం ఎంతో కాలం నిలువలేదు. ఇద్దరి మధ్యా మనస్ఫర్ధలు తలెత్తి .. లీగల్ గానే విడిపోయారు.
ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన విషయం వైరల్‌గా మారింది. అదేమిటంటే, శోభిత ధూళిపాళ, సమంతకు అక్క అవుతుందట. కానీ, ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. శోభితకు కూడా సమంత అనే ఒక చెల్లెలు ఉంది. దాంతో.. శోభిత ధూళిపాళ పేరును ఆధారంగా చేసుకుని ఈ వదంతి వ్యాపించింది. సోషల్ మీడియాలో శోభిత తన చెల్లెలు సమంతతో ఉన్న ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ వార్త నిజం కాదని తెలిసినా, సినీ ప్రేమికులు ఈ విషయంపై ఆసక్తిగా చర్చిస్తున్నారు.
శోభిత తనను తాను ఫుడ్ లవర్‌గా పరిచయం చేసుకుంది. ఆమె శాకాహారి. ఇంటి భోజనాన్ని ఎక్కువ ఇష్టపడుతుంది. వంట బాగా చేయడం వచ్చిన అబ్బాయినే ఇష్టపడతానని ఆమె చెప్పింది. శోభిత ఒక బుక్ లవర్ కూడా. నవలలు, హ్యారీ పోటర్ పుస్తకాలు ఆమెకు ఎంతో ఇష్టం. శోభిత తన జీవితంలో జరిగే ప్రతి విషయాన్నీ డైరీలో రాసుకుంటుంది. తన చెల్లెలు సమంతతో ఆమెకు చాలా అనుబంధముంది. ఆమెను తన సోల్ మేట్ గా చెబుతుంది.