Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం “కల్కి 2898 AD” జూన్ 27న విడుదల కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ప్రచారంలో భాగంగా మేకర్లు వరుస అప్డేట్స్ ఇస్తూ ఆసక్తిని పెంచుతున్నారు.

తాజాగా, ఈ సినిమా నుండి “థీమ్ ఆఫ్ కల్కి” అనే థీమ్ సాంగ్ ను మ‌ధుర‌లో రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సాంగ్ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా నటి శోభన స్పెషల్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు. థీమ్ సాంగ్ ప్రోమో ఇప్పటికే విడుదలై, మంచి స్పందనను పొందుతోంది.

“కల్కి 2898 AD” చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా దీపికా పాదుకోణే నటించింది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని తదితర ముఖ్య తారలు ఈ చిత్రంలో నటించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అశ్వినీ దత్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!