RC 16 : మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ 16వ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఒక అదిరిపోయే అప్‌డేట్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటించనున్నారని మేకర్లు అధికారికంగా ప్రకటించారు.

నేడు శివరాజ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఈ న్యూస్‌ను వెల్లడించడం జరిగింది. “RC16” లో శివరాజ్ కుమార్ పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని, ఈ సినిమాతో ఆయన టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నారని చిత్ర నిర్మాణ సంస్థలు వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్ తెలిపాయి.

ఇప్పటికే ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటించనున్నట్లు తెలిసి, అభిమానుల ఆసక్తిని పెంచింది. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎ.ఆర్. రెహమాన్ సంగీతం సమకూర్చుతున్నారు. “గేమ్ ఛేంజర్” తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శివరాజ్ కుమార్ పాత్ర ఈ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చనుందని అభిమానులు నమ్ముతున్నారు.

Leave a comment

error: Content is protected !!