Shivam Bhaje trailer : హీరో అశ్విన్ బాబు నటించిన తాజా చిత్రం “శివం భజే” ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలను నెలకొల్పింది. కొత్త దర్శకుడు అప్సర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందింది. డ్రామా, సస్పెన్స్ అంశాలు కూడా ఈ సినిమాలో ఉండనున్నాయని చిత్ర యూనిట్ తెలిపింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ ట్రైలర్ నిలిచింది. ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలో ఉండాల్సిన అన్ని అంశాలను మనకు ఈ ట్రైలర్ లో చూపెట్టారు. కథ కూడా కొత్తగా ఉండబోతుందని ఈ ట్రైలర్ చూస్తూ అర్థమవుతోంది. అశ్విన్ బాబు తనదైన పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాడు. వికాస్ బడిసా సంగీతం ఈ సినిమాకు మరో హైలైట్ గా నిలవనుంది.

బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్, దిగంగనా సూర్యవంశీ, హైపర్ ఆది, మురళీ శర్మ, బ్రహ్మాజీ, తులసి ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. ఆగస్టు 1న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.

Leave a comment

error: Content is protected !!