మూవీ టైటిల్: శివ వేద
నటి నటులు: శివరాజ్ కుమార్, గానవి లక్ష్మణ్, శ్వేతా చెంగప్ప, అదితి సాగర్, భరత్ సాగర్, వీణ పొన్నప్ప తదితరులు
ఎడిటర్: దీపు ఎస్ కుమార్
సినిమాటోగ్రఫీ: స్వామి జే గౌడ
సంగీతం: అర్జున్ జన్య
నిర్మాత: గీతా శివరాజ్ కుమార్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: హర్ష
విడుదల తేదీ: ఫిబ్రవరి 9, 2023

ఈ మధ్య కాలంలో కన్నడ సినిమాలు తెలుగు థియేటర్ లలో వీర విహారం చేస్తున్నాయి. దానికి ముఖ్య ఎక్జాంపుల్ కెజిఫ్, కాంతారా. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటించిన సినిమా “వేద”. గతేడాది నెలాఖురణ కన్నడ లో విడుదలై ఈ చిత్రం బ్లాక్ బస్టర్ కొట్టింది. గానవి లక్ష్మణ్ హీరోయిన్ గా హర్ష కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అందించారు. తెలుగు లో రీలిజ్ అయ్యిన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుందో లేదో తెలుసుకుందాం?

కథ:
వేద (శివ రాజ కుమార్) భార్య పుష్ప (గానవి లక్ష్మణ్) ఇద్దరు చక్కటి దంపతులు. వీరిద్దరి కుమార్తె కనక (అదితి సాగర్) జైలు నుంచి విడుదలవ్వుతుంది. ఆ క్షణం నుంచి తన తండ్రి వేద తో కలిసి గతంలో అన్యాయం చేసిన వాళ్లను ఒకొక్కరిని వెంటాడి నరికేస్తుంటారు.
గత 20 ఏళ్ళు వెనక్కి వెళ్తే, ఓ సందర్భంలో పుష్ప (గానవి లక్ష్మణ్) మామ ‘వీరా’ కారణంగా వేద జైలుకు వెళ్తాడు. ఆ సమయంలో భార్య పుష్ప చనిపోతుంది, కూతురు జైలుకు వెళ్తుంది. అప్పుడే జైలు నుంచి వచ్చిన వేద, ఈ విషయం తెలిసి గుండె పగిలేలా కుంగి కుంగి ఏడుస్తాడు. ప్రెజెంట్ లో, ఈ మర్డర్ లన్ని వేద, కనక ఇద్దరు కలిసి చేశారని తెలిసిన పోలీస్ అధికారి రమా యాక్షన్ తీసుకుపోగా, వేద కి ఒక నిజం చెప్తుంది. రమా చెప్పిన ఆ నిజం ఏంటి? అత్యంత కిరాతకంగా తండ్రీ కూతుళ్ళు ఎందుకు చంపుతున్నారు? వేద గతం ఏమిటి? కనక ఎందుకు జైలుకు వెళ్ళి వచ్చింది? ఇవ్వన్నీ తెలియాలి అంటే సినిమా చుడాలిసిందే?

కథనం, విశ్లేషణ:
తన కుటుంబానికి అన్యాయం చేసిన వ్యక్తులను వెతికి మరి పగ తీర్చుకోవడమే ఈ సినిమా కథ. ఒక్క మాటలో చెప్పాలి అంటే, వుమెన్ రివెంజ్ డ్రామా. ఈ సినిమా కథ చాలా సింపుల్‌గా ఉన్న, అందులోనే చాలా విషయాలు చెప్పాలని ప్రయత్నించాడు దర్శకడు హర్ష.

కన్నడలో శివరాజ్ కుమార్ పెద్ద హీరో అయినా, కథ కి ప్రాధాన్యత ఇచ్చి కేవలం ఓ పాత్రదారిలాగ చేసిన నటన అద్భుతం. అలా అని ఎక్కడా హీరోయిజం చూపించలేదు. వేద అత్యవసర పరిస్థితిలో ముందుకి వస్థాడే తప్ప, ప్రతి యాక్షన్ సన్నివేశాల్లో కూతురునే రంగంలోకి పంపిస్తాడు. నేను కేవలం ఆడదాన్ని కాదు, ఆడ పులి లా పెంచాడు నా తండ్రి అనేలా యాక్షన్ సీన్స్ చిత్రీకరించారు. ఇలాంటి కథ ని తెర మీద చెప్పడం కష్టమైన పని. అలాగే గానవి లక్ష్మణ్, అదితి సాగర్ రా యాక్షన్ సీన్స్ చేయించడంలో ప్రయత్నం చేసాడు దర్శకుడు హర్ష. సినిమా కథ అంతా మహిళా ప్రాధాన్యంగానే సాగుతుంది.

శివన్నపెళ్లి ఎపిసోడ్, అక్కడక్కడ వచ్చే కామెడీ సన్నివేశాలు పర్వాలేదు. ముఖ్యంగా ఒక ఆడది రఫ్ గా ఉంటే మగాళ్ళకి మరింత ఇష్టం పెరుగుతుంది అనడంలో ఈ సినిమానే ఒక ఎక్జాంఫుల్. గానవి లక్ష్మణ్ పెర్ఫామెన్స్ ఈ సినిమాకి హైలైట్. ప్రతి ఎక్సప్రెషన్ తన కళ్ళతోనే పలికించి మదిలో అలజడి క్రియేట్ చేస్తుంది. కొన్ని చోట్ల కేజియఫ్ కలర్ టింట్ ఎఫెక్ట్స్ కనిపిస్తుంది. మరొకొన్ని తెలుగు సినిమాలు గుర్తుకొస్తాయి. ఫస్టాఫ్ చాలా ఆసక్తికరంగా కోనసాగుతుంది. సినిమా లో యాక్షన్ జోడించి కమర్షియల్ విలువలతో పాటు సందేశాత్మకంగా చిత్రీకరించారు. ఇంటర్వెల్ ఎపిసోడ్ చాలా బాగుంది.

సెకండాఫ్ ఫ్లాష్ బ్యాక్‌తో కథ నడిపించాడు దర్శకుడు హర్ష. ఊహించిన కదే అయ్యిన, అల్లిన విధానం బాగుంది. కాకపోతే ఎక్కువగా అమ్మాయిలను గౌరవించడం..వాళ్ల గొప్పతనం చెప్పే ప్రయత్నం చేసాడు. ఈ సినిమా తెలుగు లో ప్రేక్షకులు చూడటానికి ఇష్టపడతారు కానీ, అనుకున్న స్థాయిలో వర్కవుట్ అవ్వడం కాస్త కష్టమే. వెయిట్ అండ్ సి…

నటీనటులు పెర్ఫామెన్స్:
హీరో శివరాజ్ కుమార్ వేద పాత్రకు ప్రాణం పోసాడు. ముఖ్యంగా కొన్ని సీన్స్ లో శివరాజ్ కుమార్ యాటిట్యూడ్, పౌరుషం, పొగరు సినిమాకు ప్లస్ పాయింట్. గనవి లక్ష్మణ్ నటన పుష్ప క్యారెక్టర్ లో నెక్ట్స్ లెవల్‌లో అసలు. ఈ సినిమా చూసాక, ఆమె నటనకి ప్రేక్షకులు బ్రమ్మరథం పడతారు. ఫ్యూచర్ లో లేడి సూపర్ స్టార్ గా ఎదిగే ఛాయలు నిండుగా కనిపిస్తున్నాయి. ఇక కూతురు కనక పాత్రలో సింగర్ అదితి సాగర్ అద్బుతంగా మెప్పించారు. కొన్ని యాక్షన్ సీన్స్ లో అదితి చేసిన పెర్ఫామెన్స్ సినిమాకి మరో బోనస్. తదితరులు తమ పరిధి మేరకు బాగానే రాణించారు.

సాంకేతిక విభాగం:
దర్శకుడిగా హర్ష తీసుకున్న పాయింట్ బాగున్నా స్క్రీన్ ప్లే దగ్గర కొన్ని లోపాలు ఉన్నాయి. మరీ ఫ్లాట్ స్క్రీన్ ప్లే అవ్వడం మైనస్.
సినిమాటోగ్రఫీ స్వామి జే గౌడ ఇచ్చిన విజ్యువల్స్ ఈ సినిమాకు ప్రాణం. ఈ సినిమాలో కలర్ టింట్ సూపర్బ్. అలాగే అర్జున్ జన్యా సంగీతం బాగుంది. ఎడిటింగ్ విషయంలో కాస్త శ్రద్ద పెట్టాలిసింది. అలాగే, డ్యూరేషన్ కాస్త తగ్గించి ఉంటె సినిమా మరో లెవెల్ ఉండేది. గీతా శివరాజ్ కుమార్ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

బాటమ్ లైన్: పుష్ప తగ్గేదిలే “శివ వేద”
రేటింగ్: 3/5
రివ్యూ బై: తిరుమలశెట్టి వెంకటేష్

Leave a comment

error: Content is protected !!