Shine Tom Chacko : దసరా నటుడు షైన్ టామ్ చాకో పెళ్లి కి సిద్ధమవుతున్నాడు. చాలా కాలంగా డేటింగ్ చేస్తున్న తనూజతో ఆయన నిశ్చితార్థం జరిగింది. ఇటీవల జరిగిన ఈ వేడుక ఆనంద క్షణాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఫోటోలలో ఈ జంట సంతోషంగా కనిపిస్తున్నారు.

షైన్ టామ్ చాకో సాధారణ షర్టు మరియు తెల్లటి ప్యాంటు ధరించగా, తనూజ నిశ్చితార్థం కోసం తెల్లటి గౌన్ ధరించారు. వీళ్ల ప్రేమ వార్తలు చాలా కాలంగా చక్కర్లు కొడుతున్నాయి, చాకో నవంబర్ 7, 2023న తనూజతో ఉన్న ఫోటో పోస్ట్ చేయడం ద్వారా జనం దృష్టిలో పడ్డాడు. షైన్‌కు ఇంతకు ముందు ఒక వివాహం జరగగా ఎనిమిదేళ్ల కొడుకు కూడా ఉన్నాడు.

డ్యాన్స్ పార్టీ’ మలయాళ సినిమా ప్రమోషన్ల సమయంలో కలిసి వారు బహిరంగంగా కనిపించడం వల్లవ వారి రిలేషన్ బైట పడింది. షైన్ టామ్ ప్రస్తుతం ‘దేవర పార్ట్ 1’, ‘నడిగర్ తిలకం’, తంగమణి’ లాంటి ఇంట్రెస్టింగ్ సినిమాల్లో నటిస్తున్నాడు.

Leave a comment

error: Content is protected !!