శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం “లవ్ స్టోరి”. ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం నుండి విడుదలవుతున్న ప్రతి పాట కూడా మంచి ఆదరణ తెచ్చుకుంటుంది. ఇటీవల విడుదల చేసిన మూడో పాట “సారంగ దరియా” పాట సూపర్ హిట్ అవ్వడమే కాకుండా, కేవలం 24 గంటల్లోనే 6 మిలియన్ వ్యూస్ దాటి యూట్యూబ్ లో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా ఈ పాటని కోరియోగ్రఫి చేసిన శేఖర్ మాస్టర్ మీడియాతో తన సంతోషాన్ని పంచుకున్నారు.

శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ : ఈ మూవీలో రెండు మెయిన్ సాంగ్స్, మూడు బిట్ సాంగ్స్ చేశాను. ఇప్పుడు విడుదలైన “సారంగ దరియా” పాటతో పాటు “రెయిన్” నేపథ్యంలో సాగే ఇంకో పాట కూడా ఉంది. ఇవి రెండు సినిమాలో ప్రధానమైన పాటలు. సాయి పల్లవిని ఉద్దేషిస్తూ తను మంచి డ్యాన్సర్ ఇప్పుడున్న హీరోయిన్స్లో తను బెస్ట్ డాన్సర్ అని చెప్పడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. అంత మంచి క్లాసికల్ డాన్సర్ ని పెట్టుకుని బాగా చేయకపోతే తప్పు తమది అవుతుంది. ఆమెకు ఏ ఎక్స్ ప్రెషన్ ఇచ్చినా బాగుంటుంది. వన్స్ ఒకసారి పాట ఎడిట్ చేసి చూస్తే ఈ అమ్మాయి కంటే ఇంకెవరు బాగా చేయలేరేమో అనిపిస్తుంది.

ఆమె నేపథ్యం చూస్తే ‘ఢీ’ 4 నుంచివచ్చింది. నేను ‘ఢీ’ నుంచే వచ్చాను. మేము కొరియాగ్రఫర్ కొన్ని మూమెంట్స్ అనుకుంటాం. అవి కరెక్ట్ అయిన హీరో , హీరోయిన్ చేస్తేనే బాగుంటుంది. ఇవి ఎవరు చేస్తారా అని అనుకుంటాం. సాయి పల్లవితో ఈ మూవ్ మెంట్ రాదు అని ఎప్పుడూ అనలేదు. మేము చెప్పిన మూవ్ మెంట్స్ ను ఇంకా బాగా చేసి చూపిస్తుంది. మాలాంటి డాన్స్ మాస్టర్ లకు సాయి పల్లవి లాంటి హీరోయిన్ దొరకడం అదృష్టం. శేఖర్ కమ్ముల గారు మాకు పాట గురించి చెప్పినప్పుడే చాలా క్లియర్ గా చెబుతారు. ఇది జానపదం కాబట్టి స్టెప్స్ ఎలా ఉండాలో చెప్పారు. సాయి పల్లవి ఉండటం వల్ల ఇంకా సాంగ్ హైప్ అయ్యింది. ‘ఫిదా’లో సాయి పల్లవితో వచ్చిండే చేసేప్పుడు ఏ అంచనాలు లేవు. కానీ ఈ లవ్ స్టోరి పాటకు వచ్చేప్పటికి చాలా ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. కానీ మేము ఆ అంచనాలు ఒత్తిడి పెట్టుకోలేదు. వచ్చిండే ఎలా చేశామో అలాగే చేశాము. వచ్చిండే సాంగ్ ను సారంగ దరియా పాట బీట్ చేస్తుందో లేదో చెప్పలేను. చూడాలి. మూడు రోజులు రిహార్సల్స్ చేసింది. మూడు నైట్స్ లో పాట చేశాం. సాయి పల్లవి కాబట్టి త్రీ డేస్ లో పూర్తి అయ్యింది. డిఫరెండ్ కైండ్ ఆఫ్ సాంగ్స్ చేసినప్పుడు సంతృప్తి ఉంటుంది. ఖైదీ నెంబర్ 150, ఫిదా రెండూ ఒకే టైమ్ లో చేశాను. ఈ రెండు పాటలు ఒకే సంతృప్తిని ఇచ్చాయి.

సారంగ దరియా, ఇంకో రెయిన్ పాట ఉంటుంది. రెండు పాటలు బాగా చేసింది. కథ డిస్ట్రబ్ కాకుండా డాన్సులు వచ్చే థీమ్ సాంగ్ లు ఉంటాయి. లిరిక్ తగినట్లు ఉండాలని శేఖర్ కమ్ముల గారు ముందుగానే చెప్పేస్తారు. బయట ఫోక్ సాంగ్స్ లో వేరే టైప్ ఆఫ్ డాన్సులు ఉంటాయి. కానీ ఇది సినిమా కాబట్టి ఫోక్, సినిమాటిక్ కలిపి చేస్తాను. బ్యాలెన్స్ చేసుకుంటూ చేయాలి. వ్యూస్ పెరుగుతున్న కొద్దీ టెన్షన్ పెరుగుద్దా అంటే ప్రేక్షకుల అప్లాజ్ ఎవరికైనా ముఖ్యమే కదా. మూవ్ మెంట్స్ వైజ్ డైరెక్టర్స్ సజేషన్స్ ఏమి ఉండవు. కానీ కాన్సెప్ట్ మాత్రం దర్శకులు కొంత వివరించి చెబుతుంటారు. దీనికి కమర్షియల్ గా ఉండకుండా ఉండాలి. చాలా నాచురల్ గా ఉండాలని ప్లాన్ చేశాం. లిరిక్స్ ఫాలో అవాలనేది శేఖర్ కమ్ముల గారి కండిషన్. సందర్భానుసారం పాటలు చేయడం శేఖర్ కమ్ముల గారి స్టైల్ కథానుసారం పాటలు వెళ్తుంటాయి.

ఇతర దర్శకులతో పనిచేస్తున్నప్పుడు ఈయనతో చేయడం కొత్త అనుభవం. లిరిక్ ఆధారంగానే డాన్సులు కంపోజ్ చేస్తుంటాం. ఈ పాటలో కుడి భుజం మీద కడవ అనే లిరిక్ ఉంటే కడవ పెట్టకుండా ఉన్నట్లు డాన్సులు చేయించాం. శేఖర్ కమ్ముల గారికి హీరోయిన్లను చాలా అందంగా పద్ధతిగా చూపించడం ఇష్టం. మేమూ కూడా అదే ఫాలో అవుతుంటాం. సారంగ దరియా ఇంత పెద్ద హిట్ అవడం నాకు ఆశ్చర్యంగానే ఉంది. జుంబా డాన్స్ లు నాగచైతన్య మీద ఉంటాయి. ఆయన జుంబా ట్రైనర్. చిన్న చిన్న బిట్స్ ఉంటాయి . చైతూ ప్రాక్టీస్ చేసి చేశారు తను క్లాస్ చెప్తునట్లు వస్తుంటాయి. సేమ్ శేఖర్ మాస్టర్, సాయి పల్లవి, శేఖర్ కమ్ముల గారు, ఆడ వాళ్ల మధ్య సాంగ్ కాబట్టి వచ్చిండే పిల్లా పాటతో కంపారిజన్స్ వస్తాయి. కానీ చాలా జాగ్రత్తగా సిమిలారిటీస్ లేకుండా చేశాం. యాక్టింగ్ చేయడం లేదు. టీవీ షోస్ లో ఉండేవాళ్లకు యాక్టింగ్ అవకాశాలు వస్తుంటాయి. నాకూ వచ్చాయి. కానీ నాకు పెద్దగా ఇష్టం లేదు. త్వరలో డైరెక్షన్ చేస్తానేమో చూడాలి. ఇప్పటికైతే ఆలోచన లేదు. ఢీ, సినిమాలు, టీవీ షోస్ వీటి మధ్యలో కొన్ని డేట్స్ క్లాష్ అవుతుంటాయి. మా బాబు కూడా సినిమాలు బాల నటుడిగా చేస్తున్నారు. పుష్ప, ఆచార్యతో పాటు మరికొన్ని చిత్రాలకు కొరియోగ్రఫీ చేస్తున్నాను.

Leave a comment

error: Content is protected !!