‘శర్వానంద్’ సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు. ఈ రోజు తన పుట్టిన రోజు. మెగాస్టార్ చిరంజీవితో థమ్సప్ యాడ్ లో కెమరా ముందు కనిపించాలనే తన కోరికను తీర్చుకున్న శర్వా… తన కెరియర్ ప్రారంభంలో చిన్నచిన్న పాత్రలు చేస్తూ.. ఆతర్వాత సెకండ్ హీరోగా నటిస్తూ మెల్లగా హీరోగా ఎదిగాడు. 5వ తారీఖు’ సినిమాలో తొలిసారి హీరోగా నటించాడు కానీ ఆ సినిమా ఆశించిన గుర్తింపు కూడా ఇవ్వలేదు. చిరుతో చేసిన యాడ్ ను చూసి తనకు ‘యువసేన’ సినిమాలో అవకాశం వచ్చింది. ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత ‘అమ్మ చెప్పింది’ అంటూ మానసికంగా ఎదగని ఒక యువకుడిగా నటించి తనలో ఒక మంచి నటుడు ఉన్నాడని ప్రేక్షకులు గుర్తించేలా చేశాడు. చిరంజీవి ‘శంకర్ దాదా M.B.B.S’ లో వెంకటేష్ ‘లక్ష్మి’ వంటి అగ్ర హీరోల సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందాడు. ఈ రెండిటిని చూసిన క్రిష్ తన ‘గమ్యం ‘ సినిమాలో అవకాశం ఇవ్వడంతో ఇక ఆ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో తన గమ్యాన్ని ఏర్పరచుకున్నాడు. అలా మొదలైన తన నట ‘ప్రస్థానం’ లో ఒకే మూస ధోరణిలో కథలను ‘మళ్ళీ మళ్ళీ’ ఎన్నుకోకుండా చేసిన సినిమాలు ‘ హిట్లు ఫ్లాపులు అంటూ పడి పడి లేచిన ‘రన్ రాజా రన్’ అంటూ ‘ఎక్ష్ప్రెస్స్ రాజా’ లాంటి తన కెరీర్ కి ప్రేక్షకులు అభిమానులు ‘శతమానం భవతి’ అంటూ ఈ ‘మహానుభావుడి’ని ఆశీర్వదించారు. మంచి మంచి సినిమాలు చేయాలనీ తన మనసులో కలిగే ‘రణరంగం’ కు ‘జాను’ వంటి పాత్రాలతో ఎప్పటికప్పుడు ‘శ్రీకారం’ చుడుతూ తెలుగు పరిశ్రమలో తను ‘ అందరి బంధువు’ని గా ‘మహాసముద్రం’ లా తన నట ‘ప్రస్థానం’ను మలుచుకుంటూ సినిమాలు చేస్తున్న ‘శర్వానంద్’ ‘జర్నీ’ సక్సెస్ఫుల్ గా సాగాలని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతుంది మూవీ వాల్యూం.

శ‌ర్వానంద్ ప్రస్తుతం చేస్తున్న ‘శ్రీకారం’ మార్చి 11న మహా శివ‌రాత్రి కానుక‌గా చిత్రం ప్రేక్షకుల ముందుకు రాన్నుంది. మ‌రోవైపు ఆర్ఎక్స్ 100 చిత్రాన్ని తెర‌కెక్కించిన అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌కత్వంలో మ‌హా స‌ముద్రం చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంలో శ‌ర్వానంద్‌తో పాటు సిద్ధార్ద్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నాడు. అదితి రావు హైద‌రి, అనుఎమ్మాన్యుయేల్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆగ‌స్ట్ 19న విడుద‌ల చేయ‌నున్నారు. ఈ రోజు శ‌ర్వానంద్ పుట్టినరోజు సంద‌ర్భంగా మూవీ నుండి ఆయ‌న లుక్ విడుద‌ల చేశారు.

Leave a comment

error: Content is protected !!