Sharukh Khan : బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, తన కెరీర్‌లో మరో ట్విస్ట్ తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు రొమాంటిక్ హీరోగా, యాక్షన్ స్టార్‌గా ప్రేక్షకులను అలరించిన షారుక్, ఇప్పుడు హంతకుడి పాత్రలో నటించాలని కోరుకుంటున్నారు.
గతేడాది ‘పఠాన్’ , ‘జవాన్’ చిత్రాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన షారుక్, తన కెరీర్‌లో ఇప్పటి వరకు చేయని పాత్రలను చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న షారుక్, తనకిష్టమైన పాత్రల గురించి మాట్లాడుతూ, “నేను చిత్రపరిశ్రమకు వచ్చిన ఈ 30 ఏళ్లలో పూర్తిస్థాయి యాక్షన్ సినిమాల్లో నటించాలనే నా కోరిక ‘పఠాన్’, ‘జవాన్’లతో నెరవేరింది. ఇప్పటి వరకూ సినిమాల్లో షారుక్ అంటే అభిమానులకు హీరోననే తెలుసు. కానీ ఇప్పుడొక చెడ్డ వ్యక్తిలా.. హంతకుడి పాత్రలో తెరపై కనిపించాలనుకుంటున్నా. భవిష్యత్తులో ఇలాంటి పాత్రల్లో అవకాశం వస్తే అంగీకరించడానికి నేను సిద్ధమే” అని తెలిపారు. నిజానికి 90s లో వచ్చిన బాజీగర్ మూవీలో షారుఖ్ ఖాన్ చేసిన పాత్ర అదే.
షారుక్ ఖాన్ ఈ విషయం చెప్పడంతో, ఆయన తన కుమార్తె సుహానా ఖాన్‌తో కలిసి నటిస్తున్న ‘కింగ్’ అనే చిత్రంలో హంతకుడిగా కనిపించనున్నట్లు నెట్టింట్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన కోసం వేచి ఉండాలి.