Sharukh Khan :  ప్రతిష్ఠాత్మక 77వ లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ జీవితకాల సాఫల్య పురస్కారం అందుకోనున్నారు. ఆయనకు ‘పార్డో అలా కెరియరే అస్కోనా-లోకర్నో టూరిజం’ అవార్డును ఆగస్టు 10న స్విట్జర్లాండ్‌లోని లోకర్నోలో జరిగే ఈ చిత్రోత్సవాలలో అందించనున్నారు. 32 ఏళ్ల సినీ కెరీర్‌లో 100కి పైగా చిత్రాలలో నటించిన భారతీయ సూపర్‌స్టార్, గ్లోబల్ ఐకాన్ షారుక్ ఖాన్ అన్ని రకాల జానర్స్‌లో, విభిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

భారతీయ సినిమాకు చేసిన అపార సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు ఆయన్ను వరించింది.  షారుఖ్ ఖాన్ ఈ పురస్కారం అందుకున్న తొలి భారతీయ నటుడుగా చరిత్ర సృష్టించారు. ఇంక.. షారుక్ ఖాన్ నటించిన ‘దేవదాస్’ చిత్రాన్ని ఆగస్టు 7న ఈ చిత్రోత్సవాలలో ప్రదర్శించనున్నారు. ఈ వార్త షారుక్ ఖాన్ అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్‌లో జీవితకాల సాఫల్య పురస్కారం అందుకోవడం షారుక్ ఖాన్‌కు గొప్ప గౌరవం అనే చెప్పాలి.

Leave a comment

error: Content is protected !!