అక్కినేని నాగార్జున 1989 లో ‘గీతాంజలి’ చిత్రంతో రొమాంటిక్ హీరోగానూ, లవర్ బాయ్ గానూ మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. అయితే అదే ఏడాది వచ్చిన ‘శివ’ చిత్రం నాగ్ కెరీర్ నే అనూహ్య మలుపు తిప్పింది. ఈ సినిమాతో నాగార్జున బ్రహ్మాండమైన క్రేజ్ తెచ్చుకొని యూత్ ఐకాన్ గా ఎదిగారు. అయితే ఆ ఒక్క సినిమా తెచ్చిపెట్టిన ఎనలేని క్రేజ్ ..ఆయన తదుపరి చిత్రాల్నిపరాజయాల బాటపట్టించింది. ‘ప్రేమయుద్ధం, నేటి సిద్ధార్ధ, ఇద్దరూ ఇద్దరే , చైతన్య’లాంటి సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్స్ అయ్యాయి. అయితే ఆ జాబితాలో కలిసిన మరో భయంకరమైన ఫ్లాప్ చిత్రం ‘శాంతి క్రాంతి’ . కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్ స్వీయ దర్శకత్వంలో తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో అతి భారీగా తెరకెక్కిన ఈ సినిమా .. మూడు భాషల్లోనూ దారుణంగా డిజాస్టరై బయ్యర్స్ కు తీరని నష్టం కలిగించాయి. తెలుగు వెర్షన్ లో నాగార్జున, రవిచంద్రన్, జూహీ చావ్లా , ఖుష్బూ నటించగా.. తమిళంలో రజనీకాంత్, రవిచంద్రన్ హీరోలుగా నటించారు. ఇక కన్నడ వెర్షన్ లో రవిచంద్రన్ , రమేశ్ అరవింద్ హీరోలుగా నటించారు. రవిచంద్రన్ అప్పట్లోనే ఈ సినిమాను చాలా భారీ ఎత్తున నిర్మించి .. భారీగా నష్టపోయారు.కానీ హంసలేఖ ఈ చిత్రానికి ఇచ్చిన పాటలు మాత్రం సూపర్ హిట్టయ్యాయి. ముఖ్యంగా అర్ధరాత్రి అంటూ సాగే పాట ఇందులో హీరో ఇంట్రడక్షన్ కూడ చాల స్టైలిష్ గా ప్లాన్ చేసారు.

Leave a comment

error: Content is protected !!