Gamechanger : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన “గేమ్ ఛేంజర్” సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అంజలి, కియారా అద్వానీ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి తమిళ స్టార్ దర్శకుడు శంకర్ తెరకెక్కి్స్తున్నారు. రామ్ చరణ్ తన పాత్ర చిత్రీకరణను దాదాపు పూర్తి చేసుకున్నాడు. ఒకటి లేదా రెండు రోజుల షూటింగ్ మిగిలి ఉంది. ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది.

చివరి షాట్ లో రామ్ చరణ్ ఎంట్రీ దృశ్యాన్ని శంకర్ చిత్రీకరిస్తున్నారట. ఇప్పటివరకు చాలా సన్నివేశాలను పూర్తి చేసిన దర్శకుడు చివరగా చరణ్ పాత్ర పరిచయ సన్నివేశంతో షూటింగ్ కి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారట. దీంతో సినిమాలో చరణ్ ఎలాంటి ఎంట్రీ ఇవ్వబోతున్నాడో అనే ఆసక్తి మరింత పెరిగింది.

టైటిల్ కార్డ్ వరకు శంకర్ తన స్టైల్ లో చాలా పవర్ ఫుల్ గా చిత్రీకరించి, చివరగా హీరో పాత్రను సింపుల్ గానే కానీ సెన్సేషనల్ గా పరిచయం చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు. ఈ సినిమాకి ఇంకా రిలీజ్ డేట్ ఫిక్స్ అవలేదు.

Leave a comment

error: Content is protected !!