చిత్రం: ‘శాకుంతలం’
నటి నటులు: సమంత, దేవ్ మోహన్, మోహన్ బాబు, అనన్య నాగళ్ళ, ప్రకాష్ రాజ్, గౌతమి, మధుబాల, అల్లు అర్హ, వర్షిణి సుందరాజన్ తదితరులు
డైలాగ్స్: సాయిమాధవ్‌ బుర్రా
ఎడిటర్: ప్రవీణ్ పూడి
సంగీతం: మణిశర్మ
ఛాయాగ్రహణం: శేఖర్ వి జొషెఫ్
కో-ప్రొడ్యూజర్: దిల్ రాజ్
నిర్మాత: నీలిమ గుణ
రచన, దర్శకత్వం: గుణశేఖర్
విడుదల తేదీ: ఏప్రిల్ 14 2023

ఏ మాయ చేసావే సినిమా నుండి యశోద మూవీ వరుకు లేడి సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంటున్న టాలీవూడ్ స్టార్ హీరోయిన్ ‘సమంత’. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో సమంత, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన ప్యాన్ ఇండియా చిత్రం ‘శాకుంతలం’. పురాణాల్లోని ప్రేమ కథా ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి దిల్ రాజు సమర్పణలో, గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మించారు. ఇప్పటికే, భారీ ఎత్తున ప్రమోషన్స్ నిర్వహించడం వళ్ళ ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఏప్రిల్ 14న గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం.

కథ: మేనకా(మధుబాల) & విశ్వామిత్ర కలయికలో పుట్టిన బిడ్డ మరియు శాకుంతుల పక్షులచే రక్షింపబడడంతో ‘శకుంతల'(సమంత) అని పేరు వచ్చింది. కణ్వమహర్షుల ఆశ్రమాన్ని కాపాడిన దుష్యంతుడి(దేవమోహన్)తో శకుంతల ‘గాంధర్వ’ వివాహం చేసుకొని శారీరకంగా ఒక్కటవ్వుతుంది. నిండు గర్భిణితో ఉన్న శకుంతలని ‘దుర్వాసనుడు’(మోహన్ బాబు) శపిస్తాడు. అసలు దుర్వాసనుడు ఎందుకు శపిస్తాడు? నిండు గర్భిణితో ఉన్న సమంత ని దుష్యంతుడు ఎందుకు వేలి వేస్తాడు? ఈ రెండిటికి సంబంధం ఏమైనా ఉందా అని తెలియాలి అంటే? మీరు తప్పకుండ సినిమా చుడాలిసిందే?

కథనం, విశ్లేషణ: ‘ఆది పర్వం’లో వచ్చిన శకుంతల, దుష్యంతుడి కథను ఆధారంగా ‘ఏడుగురు’ నటి నటులతో కలిసి ‘కాళిదాసు’ అభిజ్ఞాన శాకుంతలం రాసారు. పురాణాల్లో శకుంతల అనగానే ‘శృంగార’ రూపం గుర్తొస్తుంది. కానీ, ఆమె యొక్క ‘శక్తి’ ఏంటో అనేక నాటకాల్లో చూపించబడింది. అలా కొన్ని నాటకాలు పలు విదేశాల్లో బాగా ‘ఫెమస్’. శృంగార పాత్రల్లో శకుంతల గా నటించిన హీరోయిన్ ‘సమంత’ను డైరెక్టర్ ‘గుణశేఖర్’ ఏ విధంగా తెర మీద చూపించాడో తెలుసుకుందాం?

హీరోయిన్ సమంత ని శకుంతల లో ఉండే శృంగార కోణం తగ్గించి, ఆమెని ‘ఆత్మాభిమానం’ కోణంలో చూపించడం సక్సెస్ అయ్యారు. కణ్వమహర్షుల ఆశ్రమంలో జంతువుల దాడి జరుగుతుండగా అక్కడికి విచ్చేసిన దుష్యంతుడు చాక చక్యంతో ప్రాణం నష్టం జరగకుండ ఆపుతాడు. కాకపోతే, దేవ్ మోహన్ ఇంట్రడక్షన్ బాగున్నప్పటికీ సరైన ఎలివేషన్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ లేకపోవడం. అదే విధంగా, కాలనేమి వారసులతో జరిగే యుద్ధం తెర మీద పెద్ద ఆసక్తికరంగా అనిపించకపోవటం సినిమాకి మైనస్ అని చెప్పచ్చు.

దుష్యంతుడితో శకుంతల ‘గాంధర్వ’ వివాహం చేసుకొని శారీరకంగా ఒకటై ‘తల్లి’ కావడం, ఆ గర్భం తనది కాదంటూ దుష్యంతుడు వేలి వేయటం. ఆ భారాన్ని మోస్తూ రాజులు, సైనికులు తరుముతుంటే వాళ్ళ మధ్య తప్పించుకొని ఎలా బిడ్డని కాపాడుకుంది. ఫస్ట్ హాఫ్ లో వచ్చిన మల్లికా మల్లికా, ఏలేలో ఏలేలో రెండు సాంగ్స్ అద్భుతంగా ఆకట్టుకుంటాయి. నీ కష్టానికి కన్నీళ్లు పెట్టగలమే కానీ, ఖర్మ ని పంచుకోలేము ఇలా అక్కడక్కడ వచ్చే డైలాగ్స్ బాగుంటాయి.

‘జంతువులు’ మధ్య శకుంతల పుట్టి పెరగడంతో వాటిని ‘స్నేహితులు’ గా మలుచుకున్న తీరు తెర మీద చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరిని ఆశ్చర్యపరుస్తుంది. డైరెక్టర్ గుణశేఖర్ గత మూవీ లో ‘సిజి’ విషయంలో దెబ్బ పడడంతో ఈ సారి, శాకుంతలం మూవీని విజ్యువల్ వండర్ గా తీర్చిదిద్దారు. కాకపోతే, ఈ సినిమాని ‘3డి’ లో రీలిజ్ చేసినప్పటికీ సినిమాకి పెద్దగా ప్లస్ అవ్వకపోవడం కోసం మెరుపు.

పురాణాల్లో శకుంతల ‘కథ’ని ఈ తరం ప్రేక్షకులకి చెప్పడానికి ముందుకి వచ్చిన డైరెక్టర్ గుణశేఖర్ కి ప్రత్యేక అభినందనలు. కాకపోతే, కథలో ‘డ్రామా’ బాగా సమకూర్చినప్పటికీ ‘ఎమోషన్స్’ పండకపోవటం. పైగా, కథని పూర్తిగా చెప్పడంలో విఫలమయ్యారు అని చెప్పచ్చు.

నటి నటులు పెర్ఫామెన్స్:
లేడి సూపర్ స్టార్ సమంత ‘శాకుంతల’ గా తెర మీద అద్భుతంగా నటించి మెప్పించింది. కాకపోతే, తెర మీద సరైన ఫ్రెష్ నెస్ కనిపించకపోవడం కోసమెరుపు. దేవ్ మోహన్ దుష్యంతుడిగా యాప్ట్ అయ్యినప్పటికీ మెచ్యూరిటీ కనిపించలేదు. కానీ, యాక్టింగ్ పరంగా పర్వాలేదు అనిపించుకున్నాడు.
మోహన్ బాబు నిడివి తక్కువే అయ్యినప్పటికీ కి రోల్ పోషించారు. ప్రకాష్ రాజ్ అతిధి పాత్ర లో ఆకట్టుకున్నారు. నవమానవ జాతి రారాజు అయ్యిన ‘అల్లు అర్హ’ యాక్టింగ్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. మధు బాల, శరత్ కుమార్, అనన్య నాగళ్ళ, గౌతమి, వర్షిణి సుందరాజన్ తదితరులు తమ పరిధి మేరకు బాగానే ఆకట్టుకున్నారు.

సాంకేతిక విభాగం: డైరెక్టర్ ‘గుణశేఖర్’ కథ, కాస్టింగ్ ఎంచుకున్న తీరు బాగుంది. కాకపోతే, గతంలో ‘సిజి’ విషయంలో విఫలమైతే, ఇప్పుడు కథ ని చెప్పడంలో విఫలమైరాని చెప్పచ్చు. ‘సాయిమాధవ్‌ బుర్రా’ డైలాగ్స్ తెర మీద బాగున్నప్పటికీ పెద్దగా పేలకపోవడం కోసం మెరుపు. ప్రవీణ్ పూడి ‘ఎడిటింగ్’ కి పది నిమిషాలు పని చెప్పాలిసింది. కొన్ని సంవత్సరాలు తరువాత ‘మణిశర్మ’ అందించిన సాంగ్స్ మంచి ఆధరణ లభిస్తుంది. కాకపోతే, అక్కడక్కడ వచ్చే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కథ స్థాయికి రీచ్ అవ్వలేదు. శేఖర్ వి జొషెఫ్ అందించిన సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి హైలైట్. సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ ఏ మాత్రం తీసిపోకుండా రిచ్ గా ఉన్నాయి.

రేటింగ్: 2.5/5
బాటమ్ లైన్: హార్ట్ & సోల్ ‘సమంత’ గా ఈ ‘శకుంతల’.
రివ్యూ బై :  తిరుమలశెట్టి వెంకటేష్

 

Leave a comment

error: Content is protected !!