తెలుగునాట షాడో అంటే తెలియని వారు లేరు. ఆ డైనమిక్ హీరో పేరును జనంలోకి తీసుకుని రావడంలో ఘనవిజయం సాధించారు ఫేమస్ రైటర్ మధుబాబు. ఆ సిరీస్ లో  వచ్చిన ప్రతీ పుస్తకం మార్కెట్ లో ఇప్పటికీ హాట్ కేక్ లా అమ్ముడు పోతోంది. 80, 90ల్లో షాడో సిరీస్ లో వచ్చిన స్పై అడ్వెంచర్స్ ను ఇతర రైటర్స్ కూడా కాపీ కొట్టి పబ్బం గడుపుకున్న సంగతి షాడో ప్రేమికులందరికీ తెలుసు. ఇప్పుడు వారందరికీ ఒక శుభవార్త. త్వరలోనే షాడో సిరీస్ .. బిగ్గెస్ట్ విజువల్ ఫ్రాంచైజీ గా  రానుంది. దానికి శ్రీకారం చుడుతున్నారు ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ వారు. త్వరలోనే ఆ సంస్థ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లోకి కూడా రానుంది. అందులో విడుదల కాబోయే మొదటి ఒరిజినల్స్ షాడో సిరీసే.

దీనికి సంబంధించిన అనౌన్స్ మెంట్ ను ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత అనిల్ సుంకర ట్విట్టర్ లో తెలియచేశారు. ఇక దీనికి ఎవరు దర్శకత్వం వహించనున్నారు,  షాడో గా ఎవరు నటించబోతున్నారు  అనే విషయాలు  ఇంకా తెలియలేదు. ఇందులో షాడో స్పై అడ్వెంచర్స్ తో పాటు.. షాడో పాస్ట్ లైఫ్ సిరీస్ కూడా ఉండబోతోంది. అంటే షాడో స్పై కాకముందు ఒక గజదొంగ. రాబిన్ హుడ్ తరహాలో పెద్దలను కొట్టి పేదలకు పెట్టి జనం గుండెల్లో దేవుడవుతాడు. అలాంటి  అతడి స్కిల్స్ ను, అతడి తెలివితేటల్ని ఇండియన్ గూఢచారి సంస్థ వినియోగించుకొనే ప్రయత్నంలో  అతడ్ని .. శత్రువుల గుండెల్లో నిద్రపోనీకుండా చేసే స్పై గా మలుస్తుంది. నిన్న మొన్నటి వరకూ షాడో సాహసాల్ని అక్షరాల రూపంలోనే చూసి తరించిన పాఠకులు ఇప్పుడు షాడో ను బుల్లి తెరమీద వీక్షించనుండడం ఎంతైనా ఆనందకరం. మరి ఓటీటీలో షాడో ఏ రేంజ్ లో సాహసాలు చేస్తాడో చూడాలి.

 

Leave a comment

error: Content is protected !!