యాక్షన్ డైనమైట్ గోపీచంద్ .. లాస్ట్ ఇయర్ ‘చాణక్య’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే ఈ స్పై థ్రిల్లర్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. అందుకే తదుపరి చిత్రాల విషయంలో కాస్తంత జాగ్రత్తగా అడుగులేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సంపత్ నంది దర్శకత్వంలో ఒక స్పోర్ట్ డ్రామాను నెక్స్ట్ మూవీగా ఎంపిక చేసుకున్నాడు. కబడ్డీ నేపథ్యంలో సాగే ఒక ఇన్ టెన్స్ స్టోరీతో సంపత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. గౌతమ్ నందా చిత్రం తర్వాత సంపత్ నంది, గోపీచంద్ కలయికలో వస్తోన్న మరో సినిమా ‘సీటీమార్’ కావడం విశేషం. ఇక ఈ సినిమాలో  తమన్నా తెలంగాణ కబడ్డీ కోచ్‌ జ్వాలారెడ్డిగా నటిస్తోంది.

కరోనా వైరస్‌ కారణంగా సీటీమార్ సినిమా షూటింగ్‌ ఆగిపోయింది. లాక్‌డౌన్‌కి ముందే సినిమా 60 శాతంపైగా చిత్రీకరణ జరుపుకుంది. వచ్చే ఆగస్టు మొదటి వారంలో చిత్రీకరణ ప్రారంభి ఒకటే షెడ్యూల్లో పూర్తి చేయడానికి చిత్రబృందం ప్రయత్నాలు చేస్తుంది. జూన్‌ 12న గోపీచంద పుట్టినరోజు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఓ కొత్త స్టిల్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ..‘‘సాధ్యమైనంత త్వరగా చిత్రీకరణ పూర్తి చేసుకొని సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని’’ తెలిపారు. చిత్రంలో దిగంగన సూర్వవన్షి గోపీచంద్‌ లవర్‌గా నటిస్తుండగా, పోసాని, రావు రమేష్, భూమిక తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

 

 

Leave a comment

error: Content is protected !!