Devara : ఎన్టీఆర్‌ హైయాక్టిన్ యాక్షన్ మూవీ ‘దేవర’ అక్టోబర్ 10వ తేదీన భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ యాక్షన్ డ్రామా రెండు భాగాలుగా విడుదలవుతుంది. మొదటి భాగం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇంక ఈ సినిమా పాటల విషయానికొస్తే.. ఆల్బమ్ నుండి మొదటి పాట ‘ఫియర్ సాంగ్’ చాలా మంది దృష్టిని ఆకర్షించింది.

ఇప్పుడు, రెండవ పాట విడుదలకు సమయం ఆసన్నమైంది. ఖచ్చితమైన తేదీ ఇంకా వెల్లడి కాలేదు. కానీ ఈసారి రొమాంటిక్ నంబర్ విడుదల చేయనున్నట్లు సమాచారం. జాన్వీ కపూర్ ఈ సినిమాతోనే తెలుగు సినీరంగ ప్రవేశం చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ , జాన్వీలపై చిత్రీకరించబడిన రొమాంటిక్ సాంగ్ ఇది.   అనిరుధ్ అదిరిపోయే ట్యూన్ అందించగా.. ఆ పాట ట్రెండింగ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయక పాత్రలో నటిస్తున్నారు. యువసుధ ఆర్ట్స్ ఈ యాక్షన్ డ్రామా నిర్మాణ సంస్థ.

Leave a comment

error: Content is protected !!