ఏ హీరో అయినా బాగా నటిస్తాడు , ఓవర్ గా నటిస్తాడు.. కానీ ఆ హీరో మాత్రం .. ఏదో గోడ కట్టినట్టు, గులాబీ మొక్కకు అంటు కట్టినట్టు చాలా శ్రద్ధగా నటిస్తాడని త్రివిక్రమ్ డైలాగ్ ను మార్చి చెప్పుకోవచ్చు. అచ్చెరువొందించే యాక్టింగ్ , హావభావ ప్రకటన, చాలా నేచురల్ గా ఉండే బాడీ లాంగ్వేజ్ తో పాటు.. అతడికున్న మరో ముఖ్యమైన , చాలా విలువైన అసెట్ ఏంటంటే.. డిక్షన్. అతడు సంభాషణల్ని చాలా స్పష్టమైన ఉచ్ఛరణతో పలుకుతాడు. దానికితోడు అతడి గంభీరమైన వాయిస్ ఒక సాధారణమైన సన్నివేశాన్ని కూడా అద్భుతమైనది మార్చేస్తుంది. ఆ హీరో పేరు సత్యదేవ్. టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే ఎదుగుతోన్న హీరో. అతడు ఎంచుకుంటున్న కథల్ని, చేస్తోన్న సినిమాల్ని పరిశీలిస్తే.. అతడు భవిష్యత్తు లో టాలీవుడ్ లో వర్త్ ఉన్న హీరో కాగలడని చెప్పుకోవచ్చు.
2011లో ప్రభాస్ ‘మిస్టర్ పెర్ఫెక్ట్’ లో ఒక చిన్న పాత్ర తో సినీరంగ ప్రవేశం చేసిన సత్యదేవ్.. ఆ తర్వాత వరసగా ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది, ముకంద, అసుర, జ్యోతిలక్ష్మి, క్షణం, మనవూరి రామాయణం, ఘాజీ, రోగ్, ఆక్సిజన్, థగ్స్ ఆఫ్ హిందుస్తాన్, అంతరిక్షం’ లాంటి చిత్రాల్లో మంచి మంచి పాత్రలు పోషించాడు. ఇక ‘బ్లఫ్ మాస్టర్, బ్రోచేవారెవరురా, ఇస్మార్ట్ శంకర్, జార్జ్ రెడ్డి’ , ఉమామహేశ్వరా ఉగ్రరూపశ్య సినిమాలు అతడి యాక్టింగ్ టాలెంట్ ను బహిర్గతం చేశాయి. నేడు సత్యదేవ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆ ప్రామిసింగ్ హీరోకి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.
హ్యాపీ బర్త్ డే సత్యదేవ్