సత్య మూవీ రివ్యూ
చిత్రం : సత్య
నటీనటులు: హమరేష్, ప్రార్థన సందీప్, ఆడుగాలం మురుగదాస్, సాయిశ్రీ, అక్షయ
సంగీతం: సుందరమూర్తి కె.యస్
నిర్మాత: శివ మల్లాల
రచన, దర్శకత్వం: వాలీ మోహన్ దాస్

కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన రంగోలి చిత్రాన్ని తెలుగు లో సత్య పేరు తో అనువదించారు. అచ్చ తెలుగు సినిమా అనిపించే లా డబ్బింగ్ వెర్షన్ ని తీర్చి దిద్దారు. ఈరోజే థియేటర్స్ లో కి వచ్చిన ఈ మూవీ ఏ మేరకు ఆడియన్స్ ని మెప్పించింది అనే విషయాలు రివ్యూ లో చూద్దాం.

కథ:
ఈ సినిమా కథ విశాఖపట్నంలో జరుగుతుంది. గాంధీ (ఆడుగాలం మురుగదాస్) తన భార్య, కుమారుడు సత్య (హమరేష్) తో కలిసి జీవిస్తాడు. బట్టలు ఉతికి ఇస్త్రీ చేసే పనితో కుటుంబాన్ని పోషిస్తున్న గాంధీ, తన కొడుకును మంచి చదువు చదిపించాలని కోరుకుంటాడు. ఒకరోజు జరిగిన గొడవ కారణంగా సత్యను సస్పెండ్ చేయడంతో గాంధీ అతన్ని ఒక ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తాడు. కొత్త పాఠశాలలో సత్యకు పార్వతి (ప్రార్థన సందీప్) అనే అమ్మాయితో ప్రేమ మొదలవుతుంది. కానీ అదే సమయంలో, స్కూల్లో గ్యాంగ్ తో సత్యకు గొడవలు మొదలవుతాయి. తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి, తన ప్రేమను సాకారం చేసుకోవడానికి సత్య ఏమి చేస్తాడు అనేది ఈ కథ.

విశ్లేషణ:
సత్య ఒక సాధారణ కాలేజ్ లవ్ స్టోరీ అయినప్పటికీ, చాలా హృదయాన్ని తాకేలా ఉంది. కథనం చాలా రియలిస్టిక్ గా ఉండి, ప్రేక్షకులను కథతో కనెక్ట్ చేస్తుంది. హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. వారి నటన చాలా సహజంగా ఉంది. ముఖ్యంగా, హమరేష్ తన మొదటి సినిమాలోనే చాలా మంచి నటనను కనబరిచాడు. స్కూల్, కాలేజ్ లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. టెన్త్ క్లాస్, నిర్మలా కాన్వెంట్ లాంటి సినిమాల తరహాలోనే ఒక కుర్రాడి చదువు, ప్రేమ, కుటుంబం మధ్య జరిగే సంఘర్షణలను చూపిస్తుంది. సినిమా మొదటి భాగం సాధారణంగా సాగుతుంది కానీ, కథ ఓపెన్ అయిన తర్వాత చాలా రియలిస్టిక్ గా మారుతుంది. గవర్నమెంట్, ప్రైవేట్ కాలేజీల్లో చదువుకున్న చాలా మందికి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది.
కథ అద్భుతం అని చెప్పలేము కానీ, స్క్రీన్ ప్లే తో దర్శకుడు చేసిన మ్యాజిక్ సినిమాకు హైలైట్. మొదటి సినిమానే అయినా దర్శకుడు మేకింగ్ చాలా ఆసక్తికరంగా ఉంది. విజువల్ స్టోరీ టెల్లింగ్ తగ్గుతున్న ఈ కాలంలో, కొన్ని సీన్స్ లో దాన్ని వాడుకుని అందరినీ అలరించాడు దర్శకుడు. సినిమాలో చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ, కథ, కథనంతో చాలా మంది ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు.

నటీనటుల పెర్ఫార్మన్స్ :
హమరేష్ చాలా స్వా భావికంగా నటించి, సత్య పాత్రలో ఒదిగిపోయాడు. ప్రార్థన కూడా పార్వతి పాత్రలో చాలా అందంగా నటించింది. ఆడుగాలం మురుగదాస్ గాంధీ పాత్రలో చాలా బాగా నటించాడు. మిగిలిన నటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక విభాగం:
సుందరమూర్తి కే. యస్ సంగీతం చాలా బాగుంది. పాటలు చాలా హృదయాన్ని తాకి, సినిమాకు మరింత ప్లస్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ చాలా అందంగా ఉంది. ఎడిటింగ్ కూడా చాలా క్రిస్పీగా ఉంది. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి.

తీర్పు :
సత్య ఒక చిన్న కథతో మనసును హత్తుకునే ఒక మంచి సినిమా. కాలేజ్ రోజులను గుర్తుచేసుకునేలా ఈ సినిమా ఉంది. ఖచ్చితంగా ఒకసారి చూడదగిన సినిమా.

రేటింగ్: 3/5

గమనిక : ఈ రివ్యూ క్రిటిక్ అభిప్రాయం మాత్రమే

Leave a comment

error: Content is protected !!