Sarvanand : మనమే సినిమాతో ప్రేక్షకులను అలరించిన శర్వానంద్.. ప్రస్తుతం మూడు సినిమాల్లో బిజీగా ఉన్నాడు. వీటిలో అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న రేస్ రాజా సినిమా ఒకటి. మాళవికా నాయర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

అలాగే.. సామజవరగమన సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న రామ్ అబ్బరాజుతో కలిసి శర్వానంద్ మరో సినిమా చేస్తున్నాడు. రామ్ అబ్బరాజు తన సినిమాల్లో ఎప్పటికీ ప్రేమ, కుటుంబం లాంటి అంశాలపైనే దృష్టి పెడతారు. శర్వానంద్ కోసం కూడా అలాంటి లైటర్ వెయిన్ కథనే రాసుకున్నాడట. కానీ ఈ సారి ‘విడాకులు’ అనే కాన్సెప్ట్‌ను కథలో చేర్చడం విశేషం.

విడాకులు అనే పాయింట్ కొత్తది కాకపోయినా, రామ్ అబ్బరాజు దీనికి ఓ కొత్త కోణాన్ని ఇవ్వబోతున్నాడట. కోర్టు రూమ్ డ్రామా నేపథ్యంలో సాగే ఈ కథలో కుటుంబ కలహాలు కూడా చూపించనున్నాడని తెలుస్తోంది. ఈ కొత్త కాన్సెప్ట్.. కథ కు మరింత ఆసక్తిని కలిగిస్తుందని ఇన్‌సైడ్ వర్గాలు చెబుతున్నాయి. సంయుక్త మీనన్, సాక్షి వైద్య ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.

Leave a comment

error: Content is protected !!