Maname movie: శుక్రవారం విడుదల కానున్న “మనమే” సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ తాజాగా హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. దర్శకులు మారుతి, శివ నిర్వాణ, సాయి రాజేశ్‌ ముఖ్య అతిథులుగా హాజరై చిత్రానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ శర్వానంద్‌కు “చామింగ్‌ స్టార్‌” అనే బిరుదును ప్రకటించి, ఆయనకు సంబంధించిన ప్రత్యేక వీడియోను ప్రదర్శించారు.

ఈ వేడుకలో మాట్లాడిన శర్వానంద్ ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, పవన్ కల్యాణ్‌లకు ధన్యవాదాలు తెలిపారు. జూన్ 7న “మనమే”, జూన్ 27న “కల్కి 2898 ఏడీ” సినిమాలు విడుదలవుతున్నాయని, ప్రేక్షకులకు ఎప్పుడూ కొత్తదనం ఉన్న సినిమాలను అందించాలని ఆకాంక్షించారు.

హీరోయిన్  కృతిశెట్టి మాట్లాడుతూ ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులతో పాటు యూత్‌కు కూడా నచ్చుతుందని, శర్వానంద్‌తో కలిసి నటించడం అద్భుతమైన అనుభవమని, దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య చాలా ప్రతిభావంతుడని, విక్రమ్ ఆదిత్య నటన అద్భుతంగా ఉందని ప్రశంసించారు. “మనమే” చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో శర్వానంద్, కృతిశెట్టి జంటగా నటించారు. జూన్ 7న ఈ చిత్రం విడుదల కానుంది.

Leave a comment

error: Content is protected !!