Sarvanand : శర్వానంద్ ఎట్టకేలకు తన తాజా చిత్రం ‘మనమే’ తో సూపర్ హిట్ అందుకొని మంచి కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఈ ఫ్యామిలీ డ్రామాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించింది. మొన్న శుక్రవారం థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా రోజురోజుకు పుంజుకుంటోంది. కలెక్షన్స్ పరంగా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.

ఇదిలా ఉంటే.. మనమే సక్సెస్ కు తెగ ఎగ్జయిట్ అవుతున్న శర్వానంద్ .. ఇప్పుడు టైమ్ వేస్ట్ చేసే మూడ్ లో లేడు. తన కొత్త సినిమా షూటింగ్ లో బిజీ అయిపోయాడు. లూసర్ వెబ్ సిరీస్ ఫేమ్… అభిలాష్ కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం శంషాబాద్ ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటోంది.

మంచి బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ ఫన్ యాక్షన్ డ్రామాని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. జిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో శర్వా మరోసారి స్టైలిష్ కొత్త అవతార్‌లో కనిపించనున్నాడు. మరి ఈ సినిమా శర్వానంద్ కు ఏ స్థాయిలో సక్సెస్ అందిస్తుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!