Sarvanand : యంగ్ హీరో శర్వానంద్ నటించిన తాజా చిత్రం “మనమే”. ఈ సినిమా మిశ్రమ స్పందనలను అందుకున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులతో బిజీగా ఉన్న శర్వా, తన 36వ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

“రన్ రాజా రన్”, “ఎక్స్‌ప్రెస్ రాజా”, “మహానుభావుడు” తర్వాత యూవీ క్రియేషన్స్ లో శర్వానంద్ నటిస్తున్న నాల్గవ చిత్రం ఇది. ఈ మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడంతో, యూవీ క్రియేషన్స్ మరోసారి శర్వానంద్ తో కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి “రేస్ రాజా” అనే టైటిల్ ఖరారు చేశారు. దీనికి లూజర్ వెబ్ సిరీస్ ఫేమ్ అభిలాష్ రెడ్డి దర్శకుడు.

బైక్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఈ టైటిల్ యాప్ట్ అని చిత్రబృందం భావించింది. శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్ లో శర్వానంద్ స్టైలిష్ లుక్ లో, రేసర్ గా కనిపిస్తున్నాడు. మాళవిక నాయర్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుండగా, జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం, శర్వానంద్ కెరీర్ లో మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.

Leave a comment

error: Content is protected !!