Sarwa 37 : చార్మింగ్ హీరో శర్వానంద్ లేటెస్ట్ మూవీ ‘మనమే’ నేడే థియేటర్స్ లోకి వచ్చింది. కుటుంబ కథా చిత్రంగా ఈ సినిమా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కింది. కృతి శెట్టి కథానాయికగా నటించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉంటే.. శర్వానంద్ మరో సినిమా షూటింగ్ లేటెస్ట్ గా హైదరాబాద్‌లో పునఃప్రారంభమైంది.

రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘శర్వా 37’ అనే వర్కింగ్ టైటిల్ ఉంది. ఈ చిత్రంలో కీలక సన్నివేశాల చిత్రీకరణలో శర్వానంద్‌తో పాటు సాక్షి వైద్య (ఏజెంట్ సినిమా ఫేమ్) కలిసి నటిస్తున్నారని సమాచారం. ఇందులో మరో కథానాయికగా సంయుక్త మీనన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!