బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్  కెరీర్ లో ఒక  కలికితురాయి ‘సర్కార్’. మేకింగ్ జీనియస్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2005 లో విడుదలై పదిహేనేళ్ళు పూర్తి చేసుకుంది.. అప్పట్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సంచలన వసూళ్ళు సాధించింది. అభిషేక్ బచ్చన్, కత్రినాకైఫ్ , కోటశ్రీనివాసరావు, కెకె మీనన్, తనీషా ముఖర్జీ , అనుపమ్ ఖేర్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. గాడ్ ఫాదర్ హాలీవుడ్ చిత్రాన్ని ప్రేరణ గా తీసుకొని వర్మ తనదైన స్టైల్లో మలిచిన ఈ గ్యాంగ్ స్టర్ మూవీ కి అమితాబ్ బచ్చన్ పెర్ఫార్మెన్స్ ప్రధాన ఆకర్షణ.  అయితే అందులో శివసేన నాయకుడు బాల్ థాకరే షేడ్స్ ఉన్నాయని చెప్పుకుతీరాలి. ముంబయి రాష్ట్ర ప్రభుత్వానికి సమాంతరంగా తనో ప్రభుత్వాన్ని నడుపుతుంటాడు సర్కార్. తన శరణు కోరి  వచ్చేవారికి తనదైన శైలిలో న్యాయం చేయడం అతడి ప్రధాన వ్యాపకం. అందులో అతడి చిన్న కొడుకు శంకర్ కూడా ఉంటాడు. తప్పుచేసిన వాడు ఎవరైనా సరే.. వాడికి తన కోర్ట్ లోనే శిక్ష పడాలి అనుకొనే  సర్కార్.. తన పెద్ద కొడుకును కూడా స్పేర్ చేయడు. వర్మ అద్భుతమైన టేకింగ్ మాయాజాలంతోనూ, అమితాబ్ పెర్ఫార్మెన్స్ మాయతోనూ అద్భుతాలు సృష్టించిన ‘సర్కార్’ చిత్రానికి ఆ తర్వాత మరో రెండు సీక్వెల్స్ తీశాడు వర్మ.. అయితే ఆ రెండు చిత్రాలు సర్కార్ అంతటి స్థాయిలో సక్సెస్ కాలేకపోయాయి.  

 

Leave a comment

error: Content is protected !!