Sardar 2 : తమిళ స్టార్ హీరో కార్తీ నటించిన విజయవంతమైన స్పై యాక్షన్ థ్రిల్లర్ “సర్దార్”. ఈ సినిమాకి సీక్వెల్ గా “సర్దార్ 2” సినిమా షురూ అయ్యింది. దీనికి పి.ఎస్.మిత్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. శుక్రవారం చెన్నైలో జరిగిన పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ఘనంగా లాంచ్ అయింది. ఈ సినిమాలో కార్తీ సరసన ఆషికా రంగనాథ్ కథానాయికగా నటిస్తున్నట్లు సమాచారం. యువన్ శంకర్ రాజా సంగీతం, జార్జ్ సి.విలియమ్స్ ఛాయాగ్రహణం ఈ సినిమాకు అందిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.
ఈ సినిమా షూటింగ్ ఈ నెల 15 నుంచి చెన్నైలోనే ప్రారంభం కానుంది. భారీ సెట్స్‌తో ఈ సినిమాను చిత్రీకరించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. “సర్దార్” సినిమా 2022లో విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో కార్తీ డ్యూయల్ రోల్ లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఈ సినిమాకి సీక్వెల్ కూడా అంతే విజయవంతం అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.