కరోనా మహమ్మారి యావత్ ప్రపంచంపై తన పంజా విసిరింది.  పలు దేశాల ప్రజలు దాని బారిన పడ్డారు. ఆ పెను భూతం భారత్ కూ వ్యాపించి .. ఇక్కడ ప్రజల్నీ భయాందోళనకు గురి చేస్తోంది. దేశంలో పలు పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అందుకే దాని తీవ్రతను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. దాంతో రాజు నుంచి బంటు వరకూ .. పేద నుంచి ధనిక వర్గాల వరకూ ఇళ్ళకే పరిమితమయ్యారు. దీని కారణంగా దేశ వ్యాప్తంగా అత్యవసర సేవలు తప్ప మిగతా పరిశ్రమల్ని స్థంభించిపోయాయి.

దీంతో షూటింగ్స్ లేక హీరోలు ఇంటిపట్టునే కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. కొంత మంది ఇంట్లో రకరకాల గేమ్స్ ఆడుతున్నారు. కొందరు ఇంట్లో తమ భార్యలకు పనుల్లో  సహాయపడుతున్నారు. అందులో భాగంగానే దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకుడు రాజమౌళికి ఓ ఛాలెంజ్‌ విసిరారు.  బీ ది రియల్‌మన్‌అనే పేరుతో ఇంటి పనులు చేసిన ఓ వీడియోను ట్విటర్‌ వేదికగా పంచుకుంటూ ఇతరుల్లో స్ఫూర్తినింపాలని రాజమౌళిని కోరారు. ఈ వీడియోలో ప్లేట్లు కడుగుతూ, ఇల్లు శుభ్రం చేస్తూ కనిపించారు సందీప్‌. సాధారణంగా మగవాళ్లు గొప్పపనివారు. ఉత్తమ పురుషులు ఎప్పుడూ స్త్రీలే అన్ని పనులు చేసుకోవాలని భావించరు. ముఖ్యంగా పనివాళ్లు కూడా అందుబాటులో లేని ఈ క్వారంటైన్‌ కాలంలో వారికి మనం సహాయంగా నిలవాలిపేర్కొన్నారు. సందీప్‌ వంగా ఛాలెంజ్‌ స్వీకరించిన రాజమౌళి తను పని చేసిన వీడియోను  పోస్ట్‌ చేస్తాన‌ని తెలిపారు.  రాజమౌళి  ఈ ఛాలెంజ్‌ను ఎవరికి ఇస్తారో చూడాలి. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌ కథానాయకులుగా తెరకెక్కుతోన్న ఆర్‌ఆర్‌ఆర్‌చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు జక్కన్న. బాలీవుడ్‌లోనూ అర్జున్‌ రెడ్డిపవర్‌ చూపించిన సందీప్‌ కొత్త చిత్రానికి సిద్ధమవుతున్నారు.

https://twitter.com/ssrajamouli/status/1251777749879910401

 

Leave a comment

error: Content is protected !!