Sandeepkishan : యువ హీరో సందీప్ కిషన్ తన 30వ చిత్రం ‘మజాకా’తో మరోసారి ఆశ్చర్యపరచడానికి సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రం ప్రేక్షకులకు వినూత్నమైన వినోదాన్ని అందించబోతోంది. ‘ధమాకా’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు త్రినాథ రావు నక్కిన.. ‘మజాకా’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. AK ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం, ఒక మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. తాజాగా మాజాకా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్. దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది.

సందీప్ కిషన్ సాంప్రదాయ వేషధారణలో కనిపిస్తూ, ఆధునికతకు ప్రతీకగా ఉన్న గడియారం, బూట్లు ధరించి, ఆకట్టుకునేలా ఉన్నాడు. ఈ విభిన్నమైన రూపం ప్రేక్షకులకు ఆసక్తిని కలిగిస్తోంది. పెద్ద కుర్చీలో కూర్చొని, పెద్ద టేప్ రికార్డర్‌ను భుజంపై వేసుకుని, చిరునవ్వుతో ఉన్న దృశ్యం, చిత్రంపై ఆసక్తిని పెంచుతోంది. ‘మజాకా’ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ప్రసన్న కుమార్ బేజవాడ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే మరియు డైలాగ్స్ అందిస్తున్నారు. త్రినాథ రావు నక్కినతో ఆయన కాంబినేషన్ ఇంతకు ముందు సినిమాల్లో సూపర్ హిట్స్ అందించింది.

Leave a comment

error: Content is protected !!