యాక్టింగ్ లో ఈజ్.. యాక్షన్ లో స్టైల్ . మంచి డిక్షన్ .. చక్కటి డైలాగ్ డెలివరీ. నేచురల్ బాడీ లాంగ్వేజ్ వెరసి సందీప్ కిషన్.  టాలీవుడ్ లో యంగ్ హీరోలెంతమంది ఉన్నా.. అతడిది విభిన్నమైన శైలి. సరికొత్త కథాంశాల్ని ఎంపికచేసుకోవడం, వైవిధ్యమైన పాత్రల్ని ఎన్నుకోవడం ముందునుంచి అతడికున్న ఒక మంచి అలవాటు. ప్రముఖ ఛాయా గ్రాహకుడు ఛోటా కె.నాయుడు మేనల్లుడిగా తెలుగు తెరకు పరిచయమై.. అటు తమిళ నాట కూడా విభిన్నమైన చిత్రాలు చేసిన యంగ్ ఎక్స్ ప్రెస్ సందీప్ కిషన్.

2010లో విడుదలైన ‘ప్రస్థానం’ చిత్రంతో టాలీవుడ్ లో  సందీప్ కిషన్ నట ప్రస్థానం మొదలైంది. ఆ సినిమాలోని నెగెటివ్ రోల్ అతడికి మంచి మంచి అవకాశాలు తెచ్చిపెట్టింది. రొటీన్ లవ్ స్టోరీ, గుండెల్లో గోదారి, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ , రారా కృష్ణయ్య, జోరు , బీరువా, టైగర్ , రన్, ఒక అమ్మాయి తప్ప, నగరం, నక్షత్రం, మనసుకు నచ్చింది, నినువీడని నీడను నేనే, తెనాలి రామకృష్ణ బిఏబియల్ లాంటి చిత్రాలతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఎ1 ఎక్స్ ప్రెస్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇంకా మరిన్ని మంచి చిత్రాల్లో నటించడానికి రెడీగా ఉన్నాడు. నేడు సందీప్ కిషన్ బర్త్ డే .. ఈ సందర్భంగా అతడికి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

హ్యాపీ బర్త్ డే సందీప్ కిషన్ ..

 

Leave a comment

error: Content is protected !!