Samyuktha menon : దక్షిణాది నటీమణులు బాలీవుడ్ లో పేరు తెచ్చుకోవాలంటే సాధారణంగా బాలీవుడ్ హీరోతో నటించడం లేదా పాన్ ఇండియా సినిమాలో సైన్ చేయడం వంటి సంప్రదాయ మార్గాన్ని ఎంచుకుంటారు. కానీ మలయాళ స్టార్ సంయుక్త మీనన్ కాజోల్ నటిస్తున్న సినిమాతో అసాధారణమైన బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.

ఈ సినిమాలో ప్రధాన తారాగణంగా ప్రభుదేవా, నసీరుద్దీన్ షా కూడా ఉన్నారు. మెరుపుకలలు తర్వాత కాజోల్, ప్రభుదేవా కలిసి నటిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం.  నిఖిల్ తో స్పై చిత్రాన్ని నిర్మించిన   తెలుగు డైరెక్టర్ చరణ్ తేజ్ ఉప్పలపాటి పెద్ద బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్‌తో బాలీవుడ్ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను షారుఖ్ ఖాన్ “జవాన్” చిత్రానికి ఛాయాగ్రాహకుడు జీకే విష్ణు, యానిమల్ సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రమేశ్వర్, “పుష్ప 2” ఎడిటర్ నవీన్ నూలి వంటి టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు.

సంయుక్త అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆమె హిందీ సినిమాలో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధంగా ఉంది. టాలీవుడ్‌లో, ఆమె తదుపరి చిత్రం నిఖిల్‌ హీరోగా నటిస్తున్న “స్వయంభు. ఇదొక పీరియాడ్ యాక్షన్ డ్రామా. మరి బాలీవుడ్ లో సంయుక్త ఏ స్థాయిలో రాణిస్తుందో చూడాలి.

 

Leave a comment

error: Content is protected !!