కరోనా వైరస్ లాక్ డౌన్ సందర్భంగా.. రాజు నుంచి పేద వరకూ అందరూ ఇంటికే పరిమితమయిన సంగతి తెలిసిందే. అందరూ వివిధ రకాలుగా లాక్ డౌన్ లో కాలక్షేపం చేస్తుంటే.. కొందరు ఇంటిపనుల్లో ఆడవాళ్ళకు సహాయం చేయడం అలవాటు గా మార్చుకున్నారు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీస్ వీటి మీద బీ ద రియల్ మేన్ ఛాలెంజ్ లు కూడా విసురుకుంటూ.. అందరు సినీ ప్రముఖులకూ ఛాలెంజ్ లు విసురుతూ బిజీ గా మారారు.
టాలీవుడ్ దర్శకుడు సందీప్ వంగా మొదలుపెట్టిన ఈ వినూత్న విధానం ఒకరి నుంచి మరొకరికి చేరుతూ అందరిలో ఉత్సాహం నింపుతోంది. అయితే ఇందుకు విభిన్నంగా తనకు ఎవరూ ఈ టాస్క్‌ని ఇవ్వకపోయినా ‘రియల్‌మేన్’ అనిపించుకుంటున్నాడు సంపూర్ణేశ్ బాబు. కులవృత్తిని గుర్తుచేసుకుంటున్న వీడియో రూపొందించి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. తన భార్యకు కాలి మెట్టెలు, పిల్లలకు గజ్జెలు తయారు చేసి అందించారు. దీన్ని చూసిన నెటిజన్లు ‘నువ్వు కదా నిజమైన హీరో, సూపర్ అన్నయ్య, కులవృత్తిని మరువని మీకు వందనాలు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
రాజు పేద తేడా లేదు…
నీ ఆస్తి, డబ్బు నీ వెనక రావు..
నువ్వెక్కడి నుంచి వచ్చావో మర్చిపోకు అని నా నిజమైన స్థానం గుర్తు చేసుకుంటూమా ఆవిడ కోసం, నా పాత "కంశాలి"వృత్తి ని గుర్తు చేసుకుంటూ ఇంట్లో మిగిలిన గజ్జెలతో, తనకి కాలి మెట్టెలు, పిల్లల కోసం గజ్జెలు చేయించి ఇచ్చాను#BetheREALMAN pic.twitter.com/TDrHZtnXIL
— Sampoornesh Babu (@sampoornesh) April 23, 2020