సమంత ప్రధాన పాత్రలో శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 14గా శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ‘యశోద’. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. హరి – హరీష్… ఇద్దరు యువకులు ఈ సినిమాతో దర్శకులుగా పరిచయం అవుతున్నారు. పూజా కార్యక్రమాలతో ఇటీవల సినిమా చిత్రీకరణ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటి వరలక్ష్మీ శరత్ కుమార్ నటించనున్నారు.
నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ “సమంత ప్రధాన పాత్రలో మేం నిర్మిస్తున్న బహు భాషా చిత్రం ‘యశోద’ చిత్రీకరణ ఈ నెల 6న ప్రారంభమైంది. అప్పటి నుంచి నిర్విరామంగా షూటింగ్ జరుగుతోంది. సినిమాలో కీలకమైన మధుబాల పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపిస్తారు. నేటి నుంచి ఆమె చిత్రీకరణలో పాల్గొంటారు. ప్రధాన తారాగణంపై ఈ నెల 23 వరకూ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తొలి షెడ్యూల్ చేస్తాం. జనవరి 3 నుంచి రెండో షెడ్యూల్ మొదలవుతుంది. నిర్విరామంగా చిత్రీకరణ చేసి… మార్చికి సినిమాను పూర్తి చేస్తాం. థ్రిల్లర్ జానర్‌లో నేషనల్ లెవల్‌లో ఆడియన్స్ అందరినీ ఆకట్టుకునే కథాంశంతో తీస్తున్న చిత్రమిది. సమంత క్రేజ్, పొటెన్షియల్, ఫ్యాన్ ఫాలోయింగ్‌కు తగ్గ కథ కుదిరింది” అని చెప్పారు.
సమంత ప్రధాన పాత్రలో, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఇతర తారాగణం వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
ఈ చిత్రానికి ప్రొడక్షన్ కంట్రోలర్: ఆర్. సెంథిల్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: రషీద్ అహ్మద్ ఖాన్, రామాంజనేయులు, ఆర్ట్: అశోక్, ఫైట్స్: వెంకట్, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, మాటలు: పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి, పాటలు: రామజోగయ్య శాస్త్రి, లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక, కెమెరా: ఎం. సుకుమార్, క్రియేటివ్ డైరెక్టర్: హేమంబర్ జాస్తి, సంగీతం: మణిశర్మ, సహ నిర్మాత: చింతా గోపాలకృష్ణారెడ్డి, దర్శకత్వం: హరి – హరీష్, నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్.
Star actress Varalaxmi Sarathkumar Onboards Samantha’s Yashoda
Star actress, Samantha recently took her next project, Yashoda onto the floors. The unit commenced shoot last week and a crucial opening schedule is underway in Hyderabad now.
Coming to the topic, another talented actress Varalaxmi Sarathkumar has joined Samantha’s Yashoda now. The makers have roped in Varalaxmi for an important role in the film.
Varalaxmi Sarathkumar is known for picking diverse and author backed roles was impressed with the role offered to her in Yashoda and she readily signed the project. This will be her first collaboration with Samantha. It would be a real treat to watch two super talented actresses Samantha and Varalaxmi share the screen in the film.
Varalaxmi will be playing ‘Madhubala’ character in the film and she has joined the shoot already and is filming the scenes featuring her. The current schedule is going on in Hyderabad. The unit plans to complete this schedule by 23rd December and then move on to the second schedule in January.
Samantha will be playing an author-backed role in Yashodha, which is being directed by director duo Hari and Harish. Noted producer, Sivalenka Krishna Prasad who bankrolled super hits like Aditya 369, Gentleman, Sammohanam, and several others, is producing Yashodha under Sridevi Movies banner now.
Yashodha is a proper thriller that has a new-age plot. The film will be released in a total of five Indian languages – Telugu, Tamil, Kannada, Malayalam, and Hindi.
Speaking at the shoot commencement event which was held last week, the producer of the project, Sivalenka Krishna Prasad said “We all know that Samantha attained pan-India attention with The Family Man 2. In accordance with her current image, we have conceived a thriller that caters to a wide section of the audience.”
With Yashodha being released in five major Indian languages, Samantha’s fame is expected to grow bigger. The entire filming part is expected to be completed by March 2022. More details about the cast and crew, and as well as the release date will be announced in the due course.
The film is powered by a strong technical crew. Mani Sharma will compose the music while M Sukumar handles the cinematography. Marthand K Venkatesh is the editor.
Producer: Sivalenka Krishna Prasad
Directors: Hari and Harish
Music: Mani Sharma
Cinematography: M Sukumar
Editor: Marthand K Venkatesh
Art: Ashok
Fights: Venkat
Dialogues: Pulagam Chinnarayana, Dr.Challa Bhagya Lakshmi
Lyrics: Ramajogaiah Sastry
Line Producer: Vidya Sivalenka
Creative director: Hemambar Jasthi