విడుదల తేదీ: నవంబర్ 11, 2022
నటీనటులు : సమంత, వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, ప్రీతి అస్రాణి, రావు రమేశ్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ తదితరులు
మాటలు : పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి
ఛాయాగ్రహణం : ఎం. సుకుమార్
ఎడిటింగ్: మార్తాండ కే వెంకటేష్ 
సంగీతం: మణిశర్మ
నిర్మాత : శివలెంక కృష్ణప్రసాద్
దర్శకత్వం : హరి-హరీష్

విజయ్ శాంతి, అనుష్క శెట్టి, మాలశ్రీ, నయనతార పవర్ ఫుల్ లేడి సూపర్ స్టార్స్ తరువాత, అతి తక్కువ టైం లో మరో లేడి సూపర్ స్టార్ గా ఎదుగుతున్న హీరోయిన్ “సమంత”. సరోగసీ నేపథ్యంలో సమంత హీరోయిన్ గా రాజకీయాల అంశాలతో, మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కించిన చిత్రం “యశోద”. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణంలో, హరి హరీష్ దర్శకత్వం వహించగా మణిశర్మ సంగీతం అందించారు. ఇప్పటికే, ‘యశోద’ మూవీ పోస్టర్స్ & ట్రైలర్ ఆకట్టుకుంది. నేడు రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా? అనేది సమీక్షలో తెలుసుకుందాం.

కథ: బృందా(ప్రీతి అస్రాణి) చెల్లి ఆపరేషన్ కోసం, అక్క సమంత (యశోద) సరోగసికి సిద్దమవ్వుతుంది. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నపేద అమ్మాయిలకి డబ్బు ఆశ చూపించి సరోగసిగా మారడానికి మధు (వరలక్ష్మి శరత్ కుమార్ ) అండ్ గౌతమ్ (ఉన్ని ముకుందన్) బృందం ఓప్పిస్తారు. ఈ క్రమంలో యశోద కూడ వీళ్ళ ట్రాప్ లో పడుతుంది. ఆ ట్రాప్ లో పడ్డాక, ఏదో కుట్ర జరుగుతుంది అని యశోదకు అర్థం అవుతుంది. ఒక పక్క అనుమానాస్పద రీతిలో మరణించిన హాలీవుడ్ నటికి, ఈ సరోగసీ కి ఏమైనా సంబంధం ఉందా? అసలు యశోద ఎవరు? ఏం చేసింది? సరోగసి ద్వారా జరిగే అక్రమ వ్యాపారం ఏంటి? అనేది సిల్వర్ స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాలి.

కథనం, విశ్లేషణ:

సగటు ప్రేక్షకుడికి ‘యశోద’ కథ సరోగసీ చుట్టూ తిరుగుతుందని అందరికి తెలిసిన విషయమే కానీ, అంతకు మించి సినిమాలో ఏముంది? ఎవరూ ఊహించని కాన్సెప్ట్‌తో ‘యశోద’ను ట్విస్ట్ లతో ప్రేక్షకులని ఆకట్టుకుందా?

సినిమా ఓపినింగ్ లో అనుమానాస్పద రీతిలో హాలీవుడ్ నటి మరణిస్తుంది. ఆమెది న్యాచరుల్ డెత్ కాదని పోలీస్ లకి తెలుస్తుంది. అసలు, ఈవిడ చనిపోవడానికి సరోగసి సంబంధం ఏంటి? ఆ సంబంధం పోలీస్ లు ఎలా ఐడింటిఫై చేసారు? అసలు యశోద ఎవ్వరు? ఇలాంటి డౌట్స్ తో సినిమా స్టార్ట్ అవ్వుతుంది.      

ఫస్ట్ హాఫ్ లో బృందా(ప్రీతి అస్రాణి) చెల్లి ఆపరేషన్ కోసం, అక్క సమంత (యశోద) సరోగసికి ఓప్పుకొని ఎవ్వరికి తెలియని ఒక ప్రపంచంలో అడుగుపెడుతుంది. అక్కడ, సమంత తో పాటు చాలా మంది డబ్బు కోసం సరోగసి ఓప్పుకొని వచ్చిన తల్లులు ఉంటారు. ఆ ప్రపంచంలో ఇన్నోసెంట్ గా ఉండే సమంత ఒక ఫైటర్ గా ఎలా మారింది? సరోగసి బ్యాక్ డ్రాప్ లో జరిగే కుట్ర సమంత ఎలా కనిపెట్టింది? యశోద పాత్ర‌లో నటించిన సమంత టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. సరోగసి తల్లే కావచ్చు కానీ, తల్లి కాబోతున్న ఆనందంలో సగటు తల్లి కోరుకునే చిన్ని చిన్ని ఆనందాలు, ఆ సరోగసి తల్లులో భావోద్వేగ సన్నివేశాలను ఈ సినిమాలో చూడచ్చు. 

కొన్ని సీన్స్ లో సమంత చెప్పిన డైలాగ్  

అమ్మాయలకి దైర్యం ఉండదా? 

పురాణాల్లో కూడ నీలాంటి క్యారెక్టర్ లేదు? 

శ్రీ కృష్ణుడి ని పెంచింది “యశోద” నే?. ఇటువంటి డైలాగ్స్ థియేటర్ లో విన్నప్పుడు సగటు ప్రేక్షకుడికి గూసుబంప్స్ తెప్పిస్తాయి.    

ఈ సినిమాకి ప్రాణం పెట్టి చేసిన సమంత. డూప్, రోప్స్ లేకుండా యాక్షన్ సీన్స్ చేయడం. ఆరోగ్య పరిస్థితి బాగాలేకున్నాఉన్న సరే, సెలైన్ బాటిల్ సహాయంతో వైద్యుల పర్యవేక్షణలో డబ్బింగ్ చెప్పడం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. 

ఇక విలన్ పాత్రలో కనిపించిన వరలక్ష్మి శరత్ కుమార్ పెక్యులర్ వాయిస్, పెర్ఫామెన్స్ తో శబాష్ అనిపించుకుంది. ఉన్ని ముకుందన్ డాక్టర్ పాత్రలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. దర్శకులు హరి – హరీష్ రాసిన ఈ చిత్ర కథ అద్భుతంగా ఉంది. కానీ, కొన్ని సన్నివేశాలు సగటు ప్రేక్షకుడి కి ఇంకాస్త డిటైల్ గా చెప్తే బాగుండేది అనిపించింది. పోలీసులు తేలికపాటి ఇన్విస్టిగేషన్, కొన్ని సీన్స్ లాజిక్ లెస్ గా ఉండటం. క్లైమాక్స్ చాలా సింపుల్ గా ఎండ్ చేసిన సినిమా ఓవరాల్ గా బాగుంది. 

నటి నటులు పెర్ఫామెన్స్: లేడి సూపర్ స్టార్ సమంత మునపటి సినిమాలు కన్న తన దైన స్టైల్ లో నట విశ్వరూపం చూపించింది. ముఖ్యంగా తల్లి పాత్రలో జీవిస్తునే పేషెంట్ గా ఓదిగిపోయింది. ప్రీతి అస్రాణి సిస్టర్ క్యారెక్టర్ గా చేసినంత సేపు ఎమోషనల్ గా బాగా చేసింది. సమంత సరోగసి గ్యాంగ్ కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ, జెన్నీ పర్వాలేదు అనిపించారు. ఇకపోతే, వరలక్ష్మి శరత్ కుమార్ పెర్ఫామెన్స్ విలనిజం అంటే ఇది అనేలా చాటి చెప్పింది. ముఖ్యంగా, వరలక్ష్మి తప్ప ఆ క్యారెక్టర్ మరెవ్వరిని ఉహించుకోలేనంతగా టాప్ నాచ్ పెర్ఫామెన్స్. ఉన్ని ముకుందన్ యాక్టింగ్ బాగానే చేసినప్పటికి ఇంకొన్ని ఇంపాక్ట్ సీన్స్ పడి ఉంటే  బాగుండనిపించింది. ఇంకా, రావు రమేశ్, మురళీ శర్మ, సంపత్ రాజ్ తదితరులు ఆయా పాత్రల్లో బాగానే రాణించారు.  

సాంకేతికవిభాగం: సరోగసీ నేపథ్యంలో కొత్త పాయింట్ తో “యశోద” మూవీ ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చినందుకు ‘హరి-హరీష్” లని అభినందించాలి. ఓవర్ ఆల్ గా, సినిమా ని డీల్ చేసిన విధానం బాగున్నప్పటికీ, కొన్ని సీన్స్ ఇంకాస్త ఎమోషనల్ గా చూపించి ఉండాలిసింది. అలాగే, వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ క్యారెక్టర్ లని ఇంకాస్త డోస్ పెంచి ఉంటె బాగుండేది. మ్యూజిక్ అందించిన మణిశర్మ గారు అదరకొట్టారు. ఎం. సుకుమార్ ఛాయాగ్రహణం కొన్ని ఫ్రెమ్స్ బ్యూటిఫుల్ గా తీర్చిదిద్దారు. ఎక్కడ ల్యాగ్ లేకుండా ఎడిటింగ్ మార్తాండ కే వెంకటేష్ చేసిన పని తీరు సూపర్బ్ అనే చెప్పాలి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. 

బాటమ్ లైన్: లేడి సూపర్ స్టార్ దిశ గా “సమంత”

రేటింగ్ : 3.5/5

రివ్యూ బై: తిరుమలశెట్టి వెంకటేష్

Leave a comment

error: Content is protected !!