ప్రస్తుతం ప్రపంచదేశాలన్నీ కరోనా వైరస్ కబంధ హస్తాల్లో చిక్కుకుంది. ఈ నేపథ్యంలో మన దేశంలో లాక్ డౌన్ మస్ట్ అయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అదేశాల్ని అనుసరిస్తూ.. ఎవరింటికి వారు పరిమితమయ్యారు. అయితే ఈ లాక్ డౌన్ టైమ్ ను సినీ సెలబ్రిటీస్ వివిధ రకాలుగా వినియోగించుకుంటున్నారు. కొందరు తమకిష్టమైన వంటకాల్ని వండుకుంటున్నారు. మరికొందరు తమకిష్టమైన సినిమాల్ని చూస్తున్నారు… గేమ్స్ ఆడుతున్నారు… పుస్తకాలు చదువుతున్నారు. అయితే అక్కినేని వారి కోడలు సమంతా మాత్రం మరో రూట్లో వెళుతోంది. అమ్మడు ఆన్ లైన్ లో ఫిట్ నెస్ కోసం వర్కవుట్స్ చేస్తూ.. చెమట చిందిస్తోంది.
వీడియో కాల్ ద్వారా వర్కౌట్స్ చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సమంత. లాక్ డౌన్ లో ఇంట్లో లేజీ గా తయారవుతున్న వారికి సమంత ఇన్స్పిరేషన్ గా నిలుస్తోంది. పెళ్లి అయిన తర్వాత చాలా మంది శరీర ఆకృతిలో మార్పులు వస్తుంటాయి. కానీ అక్కినేని వారి కోడలు సమంత మాత్రం వర్కౌట్స్ చేస్తూ అలానే మైంటైన్ చేస్తూ వస్తోంది. నిజానికి సమంత మొదటి నుండి కూడా ఫిట్ నెస్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటుంది. తాను ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి వర్క్ ఔట్స్ ఎంతో దోహదం చేస్తాయని గతంలో కూడా చాలా సార్లు చెప్పింది. పెద్ద పెద్ద బరువులను ఎత్తుతూ మగవాళ్లకు సైతం పోటీ ఇస్తోంది. ఇప్పుడు లాక్ డౌన్ లో కూడా తన జిమ్ ట్రైనర్ తో వీడియో కాల్ ద్వారా ఆర్మ్స్ కి సంబందించిన వ్యాయామం చేస్తూ ఫిట్ నెస్ ని కాపాడుకుంటోంది.