Samantha : బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌తో కలిసి నటించే అవకాశం దక్కించుకుంది తెలుగు హీరోయిన్ సమంత. ‘డంకీ’ తర్వాత షారుఖ్ ఖాన్ మరోసారి రాజ్‌కుమార్‌ హిరాణీ దర్శకత్వంలో ఒక దేశభక్తి యాక్షన్ చిత్రంలో కనిపించబోతున్నాడు. ఆ సినిమాలో సమంతను హీరోయిన్ గా ఖాయం చేసినట్టు సమాచారం.

‘మా ఇంటి బంగారం’ మూవీతో రెడీ అవుతున్న సమంత, ఆల్రెడీ సిటాడెల్ అనే యాక్షన్ వెబ్ సిరీస్ లో నటించింది. ఇప్పుడు షారుఖ్ తో జోడీ కట్టబోతుండడం విశేషంగా మారింది. హిరాణీ ఈ చిత్రానికి స్క్రిప్ట్ రాయడంలో తుది దశలో ఉన్నాడని, వచ్చే ఏడాది సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారని సినీవర్గాల సమాచారం. ఈ చిత్రానికి ఇంకా పేరు ఖరారు కాలేదు.

Leave a comment

error: Content is protected !!