కంటెంట్ బాగుంటే చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.  దానికి బెస్ట్ ఎగ్జాంపుల్‌ ఈ మధ్య కాలంలో రిలీజయిన సామజవరగమన. శ్రీ విష్ణు , రెబా మోనికా జాన్‌ జంటగా, వీకే నరేష్ కీలక పాత్రలో రూపొందిన ఈ సినిమా 50 కోట్ల క్లబ్‌లో జాయిన్ అయ్యింది. తెలుగు రాష్ట్రాలతో పాటు, ఓవర్సీస్‌లో సామజవరగమన అద్భుతంగా రన్‌ అవుతోంది. త్వరలో ఆహా ఓటీటీలోనూ స్ట్రీమింగ్ కాబోతున్న ఈ మూవీ సక్సెస్‌ విశేషాలను పంచుకోవడానికి నిర్మాత రాజేష్‌ దండ పాత్రికేయులతో ముచ్చటించారు.
విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉన్నా ఇంతటి విజయాన్ని ప్రేక్షకులందిస్తారని ఊహించలేదన్నారు నిర్మాత. ఈ చిత్రం అన్ని భాషల్లోనూ రీమేక్ చేయడానికి ఆయా భాషా మేకర్స్‌ సిద్దంగా ఉన్నారన్నారు. డైరెక్టర్‌ సాయి, భాను ఈ చిత్ర కథను తన దగ్గరకు తీసుకొచ్చారనీ, వాస్తవానిక ఈ చిత్రాన్ని సందీప్‌ కిషన్‌తో చేద్దామనుకున్నామనీ.. మైఖేల్‌ షూటింగ్‌లో బిజీగా ఉండటంతో శ్రీ విష్ణు ఎంటరయ్యాడన్నారు.
నాలుగు వారాలుగా ఓవర్సీస్‌లో అద్భుతమైన రెస్పాన్స్‌ సాధిస్తోంది. వాస్తవానికి ఓ మూడు వారాలు ఆడితే చాలు అనుకున్నాం కానీ  ఇంత చిన్న సినిమా నాలుగు వారాలుగా ప్రదర్శించబడటం చాలా పెద్ద విషయం.  పెద్ద సినిమాలకే యుఎస్‌ మార్కెట్‌లో 1 మిలియన్ మార్క్‌ పెద్ద టార్గెట్‌గా మారితే.. సామజవరగమన 1 మిలియన్ డాలర్లు క్రాస్‌ చేయడం షాకింగ్ తో పాటు చాలా ఆనందంగా ఉందన్నారు. ఇప్పటికీ శని, ఆదివారాల్లో అన్ని చోట్లా హౌజ్‌పుల్‌ నడుస్తోంది. ఈ విజయానికి ప్రీమియర్స్‌ బాగా హెల్ప్ చేసాయన్నారు. ఈ చిత్రం స్క్రిప్ట్‌ వింటున్నపుడే నవ్వొచ్చిందన్నారు. డైరెక్టర్‌ మంచి నేరేటర్.. కథ చెప్తూ క్యారెక్టర్లో దూరి యాక్ట్ చేస్తూ చెప్పాడని, అది నచ్చే ఈ సినిమా చేసామన్నారు.
తన ఫస్ట్‌ సినిమా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం గురించి స్పందిస్తూ..  ఆ చిత్రం ఓ హానెస్ట్ ఫిల్మ్, ఆ సినిమా కమర్షియల్‌గా వర్కవుట్ కాకున్నా.. తనకెంతో సంతృప్తినిచ్చిన చిత్రమన్నారు. కరెంట్ సౌకర్యంలేని ఓ విలేజ్‌,  ఓటేయ్యాలంటే 7 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఉన్న జనాల గురించి చూపించాం. అయితే ఆ ఊరిని ఆ కథను ఆడియెన్స్‌ ఓన్‌ చేసుకోలేదేమో అనిపించిందన్నారు. త్వరలో అల్లరి నరేష్‌ 62 సినిమా నిర్మించబోతున్నట్టుగా చెప్పారు. ఈ చిత్రం సోలో బ్రతుకే సో బెటర్‌ డైరెక్టర్‌ సుబ్బు మంగాదేవి డైరెక్షన్‌లో చేయబోతున్నట్టు చెప్పారు.
నవంబర్‌ నుంచి సందీప్‌కిషన్‌తో ఓ సినిమా తీయబోతున్నట్టుగా చెప్పారు. కొత్త డైరెక్టర్‌ ను ఇంట్రడ్యూస్ చేస్తూ ఏకె ఎంటర్‌టైనర్స్ బ్యానర్‌తో కలిసి చేస్తున్నామని చెప్పారు.  ఊరిపేరు భైరవకోన చిత్రం షూటింగ్ అయిపోయింది.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉందని తెలిపారు. ఇందులో 52 నిమిషాల గ్రాఫిక్స్ ఉంటాయి. ఫాంటసీ తరహాలో సాగే ఈ మూవీలో ఇంటర్వెల్‌లో అద్దిరిపోయే ట్విస్ట్ ఉంటుందన్నారు.  అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో తెలుగు హిందీలో రిలీజ్‌ కు సిద్దం చేస్తున్నట్టు తెలిపారు.

Leave a comment

error: Content is protected !!